iDreamPost

11వ జాబితా విడుదల చేసిన YSRCP..!

YSRCP: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడీ మొదలైంది. ఇక 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ వ్యూహాలు రచిస్తుంది. ఈ క్రమంలోనే మార్పులు చేర్పులు చేస్తూ పలు విడతలగా జాబితాను విడుదల చేసింది. తాజాగా 11వ జాబితాను వైఎస్సార్ సీపీ విడుదల చేసింది.

YSRCP: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడీ మొదలైంది. ఇక 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ వ్యూహాలు రచిస్తుంది. ఈ క్రమంలోనే మార్పులు చేర్పులు చేస్తూ పలు విడతలగా జాబితాను విడుదల చేసింది. తాజాగా 11వ జాబితాను వైఎస్సార్ సీపీ విడుదల చేసింది.

11వ జాబితా విడుదల చేసిన YSRCP..!

ఆంధ్రప్రదేశ్ లో  ఎన్నికల వేడి ప్రారంభమైన సంగతి తెలిసిందే. గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా  ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి..అధికార వైఎస్సార్ సీపీ గెలుపును ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడటమే కాకుండా.. బీజేపీతో కూడా పొత్తు కోసం విశ్వయత్నాలు చేస్తున్నాయి. బీజేపీతో పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం సీఎం జగన్ మోహన్ రెడ్డి సింగిల్ వెళ్తున్నారనేది మాత్రమే స్పష్టంత ఉంది. గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థులను విడతల వారిగా ప్రకటిస్తున్నారు. తాజాగా మరో జాబితాను వైఎఎస్సార్ సీపీ ప్రకటించింది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ వ్యూహాలు రచిస్తుంది. ప్రత్యర్థి పార్టీల ఊహకు అందని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే 10 విడతల్లో పెద్ద సంఖ్యలోనే అభ్యర్థులను మార్చారు. తాజాగా వైఎస్సార్ సీపీ 11వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ నియోజవర్గానికి ఇన్ ఛార్జీలను ప్రకటిస్తూ శుక్రవారం సాయంత్రం అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇక తాజాగా వైఎస్సార్ సీపీ విడుదల చేసిన 11వ జాబితా అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక వైఎస్సార్ సీపీ 11వ జాబితాను పరిశీలించినట్లు అయితే.. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ ఛార్జీగా, కర్నూలు మేయర్ బీవై రామయ్యను నియమించారు. అలానే అమలాపురం  పార్లమెంట్ స్థానంకి రాపాక వరప్రసాద్ ను నియమించింది. ఇప్పటి వరకు ఆయన రాజోల్ ఎమ్మెల్యేగా, వైఎస్సార్ సీపీ ఇన్ ఛార్జీగా  ఉన్నారు.

అలాగే.. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా రాకపాక వరప్రసాధ్ స్థానంలో ఇటీవలె పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం. ఇప్పటివరకు విడుదలైన 11 జాబితాల వారీగా చూసినట్లు అయితే  75 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్‌ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగక ముందే సీఎం జగన్ తన అభ్యర్థులను ప్రకటించి.. సమర శంఖారావం పూరించారు. సిద్ధం పేరుతో వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక అభ్యర్థులను మార్పులు విషయంపై సీఎం జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దామని,  ఆ దిశగా ప్రయత్నం చేద్దామని సీఎం జగన్ తెలిపారు.

ఈ టార్గెట్ లో భాగంగానే ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం  కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయని, అందుకు మీరంతా సహకరించండని సీఎం జగన్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని సీఎం జగన్‌.. తొలి నుంచి పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే అధినేత సీఎం జగన్ మార్పులు చేర్పూలకు  శ్రీకారం చుట్టినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. మరి.. వైఎస్సార్ సీపీ 11వ జాబితాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి