iDreamPost

నేడు రెండో దఫా వైఎస్సార్‌ వాహన మిత్ర

నేడు రెండో దఫా వైఎస్సార్‌ వాహన మిత్ర

ఎన్నికల వేళ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు.. మరో అంకానికి చేరుకున్నాయి. మొదటి ఏడాదిలోనే పలు హామీలు అమలు చేయడంతో.. ఈ ఏడాది ఆయా పథకాల ద్వారా రెండో దఫా లబ్ధి ప్రజలకు జరుగుతోంది. ఇప్పటికే వైఎస్సార్‌ రైతు భరోసా రెండో దఫా ముగియగా.. తాజాగా వైఎస్సార్‌ వాహన మిత్ర రెండో దఫా లబ్ధి వాహనదారులకు దక్కబోతోంది. ఈ పథకం కింద ఉపాధి కోసం ఆటోలు, ట్యాక్సి మ్యాక్సి క్యాబ్‌లు నడుపుకునే వారికి వాహన ట్యాక్స్, ఇన్యూరెన్స్, ఇతర ఖర్చుల కోసం వైసీపీ ప్రభుత్వం 10 వేల రూపాయలు ఇస్తున్న విషయం తెలిసిందే.

గత ఏడాది జూన్‌లో వైసీపీ ప్రభుత్వ పరిపాలన ప్రారంభం కాగా.. అక్టోబర్‌ నెలలోనే వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. మొదటి ఏడాది దాదాపు 2.29 లక్షల మందికి ఈ పథకం వల్ల లబ్ధి జరిగింది. పది వేల రూపాయల చొప్పున దాదాపు 229 కోట్ల రూపాయులు నేరుగా వాహనదారులు ఖాతాల్లో జమ చేశారు. ఈ ఏడాది కొత్తగా అర్హత ఉన్న వారి నుంచి కూడా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వాలంటీర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. అర్హతలు పరిశీలించి నూతనంగా 37,756 మందిని ఈ పథకంలోకి చేర్చింది. మొత్తం మీద ఈ ఏడాది 2,62,493 మందికి ఈ పథకం వల్ల మేలు జరుగుతోంది. దాదాపు 262.49 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందివ్వనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి