iDreamPost

వైఎస్‌ వివేక హత్య కేసు విచారణ… సీబీఐకి హై కోర్ట్ ఇస్తుందా..? ఇవ్వదా..?

వైఎస్‌ వివేక హత్య కేసు విచారణ… సీబీఐకి  హై కోర్ట్ ఇస్తుందా..? ఇవ్వదా..?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వాదనలు ముగిశాయి. సిట్‌ దర్యాప్తు వేగంగా సాగడంలేదని, వైఎస్‌ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సునితా, సౌభాగ్యమ్మ తరఫు న్యాయవాది కోర్టును కోరగా.. సిట్‌ దర్యాప్తు సాఫీగా సాగుతోందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరంలేదంటూ.. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ అంశంపై తీర్పు ఎప్పుడు వెలువరిస్తాన్నది వెల్లడించలేదు. సీబీఐ విచారణపై వాదనలు పూర్తవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివేకా హత్య కేసు ఆయన కుమార్తె, భార్య కోరుతున్నట్లుగా సీబీఐ విచారణకు హైకోర్టు అప్పగిస్తుందా..? లేకా ప్రభుత్వ వాదనను సమర్ధిస్తూ.. సిట్‌ విచారణనే కొనసాగిస్తుందా..? వేచి చూడాలి. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పులివెందులలోని తన స్వగృహంలో వైఎస్‌ వివేకా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఈ హత్య జరగడంతో అప్పట్లో సంచలనమైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి