iDreamPost

YS Jagan: జగన్.. ఆలోచనలకి అందని మొండి ఘటం! గంటల్లో లెక్క మార్చేశాడు!

  • Published Dec 12, 2023 | 1:42 PMUpdated Dec 12, 2023 | 3:00 PM

జగన్ జనాలని మాత్రమే నమ్ముతాడు.. వారు క్లీన్ చీట్ ఇచ్చిన వాళ్లకే తన పార్టీ తరఫున అవకాశం ఇస్తాడు.. 11 మంది ఇంచార్జ్ లను మార్చిన జగన్ నిర్ణయం గురించి జనాలు ఇలానే చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు..

జగన్ జనాలని మాత్రమే నమ్ముతాడు.. వారు క్లీన్ చీట్ ఇచ్చిన వాళ్లకే తన పార్టీ తరఫున అవకాశం ఇస్తాడు.. 11 మంది ఇంచార్జ్ లను మార్చిన జగన్ నిర్ణయం గురించి జనాలు ఇలానే చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు..

  • Published Dec 12, 2023 | 1:42 PMUpdated Dec 12, 2023 | 3:00 PM
YS Jagan: జగన్.. ఆలోచనలకి అందని మొండి ఘటం! గంటల్లో లెక్క మార్చేశాడు!

వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఎన్నికల్లో గెలవడం కోసం టీడీప, జనసేన కలిసి పోటీ చేస్తుండగా.. అధికార వైసీపీ పార్టీ మాత్రం.. సింగిల్ గానే ఎన్నికల బరిలో నిలవనుంది. అంతేకాక వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు సాగుతుంది. రాబోయే ఎన్నికల్లో.. గెలవడం కోసం కఠిన నిర్ణయాలు తీసకోవడానికి సైతం వెనకడాటం లేదని జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం చూస్తే అర్థం అవుతోంది. నియోజకవర్గాల్లో పరిస్థితి, సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని.. మార్పుకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. దీనిలో భాగంగా ముందుగా మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ ను మార్చేశారు ఈ నిర్ణయం నచ్చకపోవడంతో.. ఒక ఎమ్మెల్యే, ఇంచార్జ్ పార్టీకి రాజీనామా చేశారు.

ఇంకేముంది విపక్షాలు, వాటి అనుకూల మీడియా.. దీనిపై వ్యతిరేక ప్రచారాన్ని మొదలు పెట్టాయి. పార్టీని నమ్ముకున్న వారిని.. నమ్మకంగా ఉన్న వారిని జగన్ మోసం చేశాడు.. పట్టించుకోవడం లేదు.. అవసరానికి వాడుకున్నాడు అంటూ వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టాయి. మారుతున్న పరిణామాలను గమనించిన జగన్.. మరో కీలక నిర్ణయం తీసుకుని.. విపక్షాలు, వ్యతిరేక మీడియా నోరు ఎత్తే పరిస్థితి లేకుండా చేశారు.

ఒకే రోజు ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 11 మంది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలను మార్చేశారు. అందులోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకంగా ఏడుగురు ఇన్‌చార్జీలను మార్చేశారు. వ్యతిరేక ప్రచారం చేద్దామని భావించిన వారి నోళ్లు మూతపడేలా చేసి.. గంటలో లెక్క మార్చేశాడు జగన్. పైగా ముందు వెళ్లిపోయిన ఇద్దరిదీ అసలు విషయమే కాదన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ప్రస్తుతం అందరూ ఇంచార్జ్ ల మార్పు గురించే చర్చించుకుంటున్నారు

జనం మెచ్చితేనే..

సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ.. జగన్ ఓ మొండి ఘటం.. ఒక్కసారి కమిట్ అయితే.. ఇక ఎవరి మాట వినరు.. అనేది తాజా నిర్ణయంతో మరో సారి రుజువయ్యింది. జనంలో ఉండాలి.. జనంతో ఉండాలి.. జనం నుంచి మంచి మార్కులు పడాలి.. లేకుంటే పదవి ఊడిపోతుంది.. జనం నుంచి మార్కులు పడ్డవాళ్లకు ఓకే.. రిమార్కులు వస్తే మార్పు గ్యారంటీ.. జనం మాటే తనకు వేద వాక్కు అని జగన్ మరోసారి తన నిర్ణయంతో నిరూపించారని అంటున్నారు రాజకీయ పండితులు. ఆయన రాజకీయ వ్యూహాలను, నిర్ణయాలను అంచనా వేయడం చాలా కష్టమని మరోసారి నిరూపించారంటన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు, తాడికొండ, వేమూరు, చిలకలూరిపేట, గుంటూరు వెస్ట్‌, మంగళగిరి, రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీల మార్పునకు శ్రీకారం చుట్టింది వైసీపీ.

ప్రజా నాడితో పాటు పార్టీలో గ్రూపు రాజకీయాలు, సామాజిక వర్గాల ఈక్వేషన్లు, కొత్త ముఖాలను దింపే వ్యూహం వంటి రకరకాల ఆలోచనల మేరకే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని.. పైగా ఈ మార్పు వైసీపీకి కలిసి వస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల్లోపు మరింత మందిని మార్చే అవకాశం ఉందని అంటున్నారు. జగన్ నిర్ణయం పట్ల జనాలు, వైసీపీ కేడర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యలకు, సొంత ప్రయోజనాలు తప్ప, పార్టీ గెలుపు కోసం పని చేసిన వారిని పట్టించుకోని నేతలకు జగన్ సరైన ట్రీట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. ప్రజలను పట్టించుకోని ఏ నాయకులను జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్లు ఇవ్వరని.. తన తాజా నిర్ణయం ద్వారా చెప్పకనే చెప్పారని.. జగన్ కు నేతల కన్నా పార్టీ, ప్రజలే ముఖ్యమని మరోసారి నిరూపించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి