iDreamPost

Muskan Agrawal: ఏడాదికి రూ.60 లక్షలు తో ఉద్యోగం! యువతకి స్ఫూర్తిగా ముస్కాన్ అగర్వాల్ కథ!

ప్రతిభ అనేది ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా దాగి ఉంటుంది. అది బయటపడిన రోజే..వారి కంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అందుకే కొందరు యువత తమదైన ప్రతిభతో ఐఐటీ, ఐఐఏం విద్యార్థులకు పోటీగా, ఆస్థాయిలో ప్యాకేజీలు అందుకుంటారు. అలాంటి వారిలో ఒకరే ముస్కాన్ అగర్వాల్

ప్రతిభ అనేది ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా దాగి ఉంటుంది. అది బయటపడిన రోజే..వారి కంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అందుకే కొందరు యువత తమదైన ప్రతిభతో ఐఐటీ, ఐఐఏం విద్యార్థులకు పోటీగా, ఆస్థాయిలో ప్యాకేజీలు అందుకుంటారు. అలాంటి వారిలో ఒకరే ముస్కాన్ అగర్వాల్

Muskan Agrawal: ఏడాదికి రూ.60 లక్షలు తో ఉద్యోగం! యువతకి స్ఫూర్తిగా ముస్కాన్ అగర్వాల్ కథ!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఉద్యోగాల తొలగింపులకు సంబంధించిన వార్తలే  చూస్తున్నాం. ఖర్చులు తగ్గించుకుంటున్నాం అనే సాకుతో దిగ్గజకంపెనీలు సైతం ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ తదితర సంస్థలన్నీ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరోవైపు ఆయా కంపెనీలు భారీ వేతనాలతో ఉద్యోగులను నియమించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాయి. టాలెంట్ ఎక్కడ ఉన్నా గుర్తించి భారీ ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా యువతికి రికార్డు స్థాయిలో వేతనం పొంది.. అందరికి ఆదర్శంగా నిలిచింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

 ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ ప్రాంతానికి చెందిన ముస్కాన్ అంగర్వాల్ అనే యువతి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఉనాలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ(ఐఐటీ)లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆమె టెక్‌గిగ్ నిర్వహించిన ‘గీక్ గాడెస్-2022’ ఫిచ్‌లో ‘టాప్ ఉమెన్ కోడర్’ అవార్డును గెలుచుకుంది. ఈ పోటీలు గెల్చినందుకు ముస్కాన్ కి రూ. 1.5 లక్షల బహుమతి లభించింది. మొత్తం ఈపోటీల్లో 69 వేల మంది టెక్ మహిళలు పాల్గొనగా..వారందరిని ఓడించి ఆమె ఈ అవార్డు గెల్చుకున్నారు.

గీక్ గాడెస్ అనేది టెక్ గిగ్ ద్వారా నిర్వహించబడే సాఫ్ట్ వేర్ కు సంబంధింన కోడింగ్ పోటీ. ఇందులో కేవలం మహిళలు మాత్రమే పాల్గొన్నాల్సి ఉంటుంది. ఈ పోటీ ద్వారా ప్రతిభావంతులైన మహిళలను వెలికి తీస్తుంది. ముఖ్యంగా కోడింగ్ అంశాల్లో టాలెంట్ కలిగిన మహిళలను ఈ కాంటెస్ట్ ద్వారా వెలుగులోకి తీసుకొస్తారు. అలా వెలుగులోకి వచ్చిన వారిలో ఒకరే ముస్కార్ అగర్వాల్. ఆమెకు కోడింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే చదువుకునే సమయంలో 2021లో తన ప్రతిభతో వివిధ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లను రూపొందించారు.

అదే విధంగా 2021లో లింక్డ్‌ఇన్ యొక్క మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం ముస్కాల్ టాప్ -40 మహిళలలో ఒకరిగా ఎంపికైంది. ముస్కాన్ టెక్‌క్యూరేటర్స్‌తో ఇంటర్న్‌గా పనిచేసింది. ఆ సమయంలో ఆమె వివిధ కోడింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం డేటా స్ట్రక్చర్‌లు, అల్గారిథమ్ లను సృష్టించింది. 2022లో ముస్కాన్ హార్వర్డ్ వుయ్ కోడ్ లో స్కాలర్ గా గుర్తింపు పొందారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ‘వు కోడ్’ పేరుతో సదస్సు నిర్వహించబడింది. ముస్కాన్ అగర్వాల్ లింక్డ్‌ఇన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ ఇంటర్న్‌గా కూడా పనిచేశారు.

తాజాగా ఈయువతి ఏడాదికి 60 లక్షల భారీ ప్యాకెజీని పొందింది. ఉనావోలోని ఐఐఐటీలో అత్యధిక వేతనం పొందిన యువతిగా ముస్కాన్ రికార్డు సృష్టించింది. ఇక ఆమె సాధించిన విజయంపై తోటి స్నేహితులు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ ఉంటే చాలు.. ఐఐటీ, ఐఐఏంలో చదవకపోయినప్పటికీ.. ఆ స్థాయి విద్యార్థులు ధీటుగా ముస్కాన్ అదిరిపోయే ప్యాకెజీ సొంతం చేసుకుంది. మరి…అద్భుత విజయాలు అందుకున్న ఈ యువతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి