iDreamPost

కాసులు కురిపించే పథకం.. నెలకు రూ. 5 వేల పెట్టుబడితో.. రూ. 28 లక్షల వరకు పొందొచ్చు!

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అద్భుతమైన పథకం సుకన్య సమృద్ధి యోజన. ఆడపిల్లలున్న తల్లిదండ్రలుకు ఓ వరం. ఈ పథకంలో నెలకు రూ. 5 వేలు పెట్టుబడి పెడితే రూ. 28 లక్షల వరకు పొందొచ్చు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అద్భుతమైన పథకం సుకన్య సమృద్ధి యోజన. ఆడపిల్లలున్న తల్లిదండ్రలుకు ఓ వరం. ఈ పథకంలో నెలకు రూ. 5 వేలు పెట్టుబడి పెడితే రూ. 28 లక్షల వరకు పొందొచ్చు.

కాసులు కురిపించే పథకం.. నెలకు రూ. 5 వేల పెట్టుబడితో.. రూ. 28 లక్షల వరకు పొందొచ్చు!

ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు భారం కాకూడదని కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరి ప్రతి నెల కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసినట్లైతే ఆ సొమ్ముపై కేంద్రం 8 శాతం వడ్డీని కలిపిస్తుంది. కాగా కొత్త సంవత్సరం వేళ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సుకన్య సమృద్ధి యోజన పథకంపై వచ్చే వడ్డీ రేటును సవరించింది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీరేట్ల సవరణలో భాగంగా ఈ పథకం వడ్డీ రేటును 8శాతం నుంచి 8.2శాతానికి పెంచింది. దీంతో ఈ పథకంలో చేరిన వారికి మరింత లాభం చేకూరనున్నది. సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా వచ్చే డబ్బు ఆ అమ్మాయి చదువులకు, పెళ్లికి ఎంతో ఉపయోగపడుతుంది.

ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కల్పించడంలో భాగంగానే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు చేరొచ్చు. అయితే వారి వయసు 10ఏళ్లలోపు ఉండాలి. ఏడాదిలో కనీసం రూ. 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా 15 ఏళ్ల పాటు నిరంతరంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అమ్మాయికి 21ఏళ్లు వచ్చాక ఖాతా మెచ్యూరిటీతో ఆ మొత్తం సొమ్మును పొందొచ్చు. మీరు సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఖాతా తెరిచేందుకు సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకుని అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

ఒక కుటుంబానికి రెండు ఖాతాలు

సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెలుంటే ఇద్దరి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీకు ఇద్దరి కంటే ఎక్కువ మంది కూతుర్లు ఉంటే ఈ పథకం వర్తించదు. అయితే మీకు రెండోసారి కలిగిన సంతానంలో కవల ఆడ పిల్లలు పుడితే అప్పుడు మూడో ఖాతా కూడా ప్రారంభించొచ్చు.

నెలకు రూ. 5,000 పెట్టుబడితో రూ. 28 లక్షల వరకు ఆదాయం

ఆడపిల్లలు గల తల్లిదండ్రులు వారి కూతురు పేరుపై ఖాతాను ఓపెన్ చేసి సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ. 5,000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి రూ. 28 లక్షల వరకు పొందే వీలుంది. నెలకు రూ. 5 వేల చొప్పున ఏడాదిలో మొత్తం రూ. 60,000 డిపాజిట్ అవుతుంది. ఈ విధంగా, మీరు 15 సంవత్సరాలలో మొత్తం రూ.9,00,000 పెట్టుబడి పెడతారు. సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్ ప్రకారం 8.2 శాతం వడ్డీతో, మీరు రూ. 28.73 లక్షల మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతారు.

బ్యాలెన్స్ ను ఈ విధంగా తెలుసుకోవచ్చు

సుకన్య సమృద్ధి ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది విషయం మీకు ఏ బ్యాంక్ లో అయితే ఖాతా ఉంటుందో ఆ బ్యాంక్ కు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఖాతా పాస్ బుక్ ప్రింట్ తీసుకోవడం ద్వారా అందులో మీరు ఎప్పుడెప్పుడు ఎంత జమ చేశారు, ఎంత వడ్డీ జమ అయ్యింది అనే పూర్తి వివరాలు కనిపిస్తాయి. మరోవైపు.. మీరు ఆన్‌లైన్ ద్వారా కూడా అకౌంట్లో బ్యాలెన్స్ అనేది తెలుసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యి కూడా ఖాతాలో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవచ్చు. అయితే డబ్బును ఖాతా నుంచి డ్రా చేయడానికి మాత్రం వీలుపడదు. ఈ పథకానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి