iDreamPost

చిన్ననాటి స్కూల్ కి కొత్త వెలుగులు.. జగన్ కి కోన వెంకట్ కృతజ్ఞతలు!

Kona Venkat: ఏపీ విద్యావ్యవస్థలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనే మార్చేశారు. ఈ క్రమంలోనే దేశం నలుమూల నుంచి జగన్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోన్నాయి. తాజాగా ప్రముఖ రచయిత కోన వెంకట్ ఏపీ ప్రభుత్వ పాఠశాలలపై ట్వీట్ చేశారు.

Kona Venkat: ఏపీ విద్యావ్యవస్థలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనే మార్చేశారు. ఈ క్రమంలోనే దేశం నలుమూల నుంచి జగన్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోన్నాయి. తాజాగా ప్రముఖ రచయిత కోన వెంకట్ ఏపీ ప్రభుత్వ పాఠశాలలపై ట్వీట్ చేశారు.

చిన్ననాటి స్కూల్ కి కొత్త  వెలుగులు.. జగన్ కి కోన వెంకట్ కృతజ్ఞతలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. బడుగు బలహీన వర్గాల వారి అభివృద్దే లభ్యంగా ఆయన పాలన సాగుతుంది. ఇక విద్య, వైద్య రంగంలో ఆయన చేపట్టిన సంస్కరణల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను మార్చిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుంది. ఇక విద్యావ్యవస్థలో సీఎం జగన్ చేపట్టిన చర్యలపై అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇవ్వడమే మనం ఇచ్చే నిజమైన ఆస్తి అని బలంగా నమ్మిన వ్యక్తి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అందుకే ఇప్పటి వరకు పిల్లలు ఓటు బ్యాంకు కిందకు రారని ఎంతో మంది నేతలు నిర్లక్ష్యం చేశారు. కానీ సీఎం జగన్ మాత్రం ఓటు కాదు.. పిల్లల భవిష్యత్ ముఖ్యమని బలంగా నమ్మారు. అందుకు ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద ఇలా అనేక పథకాలను విద్యార్థుల కోసం ప్రారంభించాడు.

అంతేకాక ప్రభుత్వ స్కూల్ ను ప్రవేటు పాఠశాలకు ఏ మాత్రం తక్కువ కాదన్నట్లు..వాటి రూపు రేఖలు మార్చేశారు. నాడు-నేడు కింద రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేశారు. డిజిటల్ క్లాస్లును సైతం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ పెట్టారు. విద్యార్థుల టేబుల్స్, పుస్తకాలు, దుస్తువులు.. ఇలా విద్యార్థుల చదువకు అవసరమయ్యే ప్రతి విషయంలో సీఎం జగన్ ఏమాత్రం రాజీ పడలేదు. ఇక ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన ఈ మార్పును చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఇవి ప్రభుత్వ బడులా లేకా..ప్రైవేటు స్కూల్సా అనే సందేహం వ్యక్తం చేశారు. పేద పిల్లల కోసం  సీఎం జగన్ చేపట్టిన ఈ అధ్భుతమైన కార్యక్రమంలో దేశ నలుమూల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే ఎందరో విదేశీయులు సైతం ఏపీ విద్యావ్యవస్థపై ప్రశంసల వర్షం కురిపించారు.

అలానే టాలీవుడ్ సినీ ప్రముఖులు నాడు-నేడు కింద సర్కార్ బడుల రూపు రేఖలు మారిపోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ రచయిత కూన వెంకట్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా తన భావాలను వ్యక్త పరిచారు. బాపట్ల జిల్లాలో ఉన్న ఆయన సొంతూరు కర్లపాలెంలోని ప్రభుత్వ బడిన ఆయన సందర్శించారు. తన ఊరిలోని ప్రభుత్వ పాఠశాలను చూసి తరువాత సంతోషంగా ఆశ్చర్యకరంగా ఉందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. అంతేకాక అక్కడి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాసేపు ఆ ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో, తరగతి గదుల్లో తిరుగుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇలా  అనేక మంది విద్యవ్యవస్థలో సీఎం జగన్ తీసుకొచ్చిన పెనుమార్పులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.. కూన వెంకట్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి