iDreamPost

వరల్డ్ కప్ లో టీమిండియాకు ఆ బలహీనత ప్రధాన సమస్యగా మారబోతుందా?

  • Author Soma Sekhar Published - 02:44 PM, Wed - 23 August 23
  • Author Soma Sekhar Published - 02:44 PM, Wed - 23 August 23
వరల్డ్ కప్ లో టీమిండియాకు ఆ బలహీనత ప్రధాన సమస్యగా మారబోతుందా?

వరల్డ్ కప్ 2023.. ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న మెగా జాతర. మరి కొన్ని రోజుల్లో ఈ విశ్వసమరానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ లో పాల్గొనే అన్ని జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. టీమిండియా సైతం జట్టు కూర్పుకు సంబంధించి పక్కా ప్రణాళికలను రచిస్తోంది. అందులో భాగంగానే ప్రయోగాల బాట పట్టి.. యువ ఆటగాళ్లకు ఛాన్స్ లు ఇస్తోంది. అయితే బ్యాటింగ్ లో టీమిండియాకు పెద్ద బలహీనతలేమీ కనిపించనప్పటికీ.. బౌలింగ్ లో మాత్రం ఓ బలహీనత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ బలహీనతే వరల్డ్ కప్ లో టీమిండియాకు ప్రధాన సమస్యగా మారబోతోందా? అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి టీమిండియాకు ఉన్న ఆ బలహీనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ 2023 కు సంబంధించి ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాయి. కాగా.. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న టీమిండియాను ఓ బలహీన వెంటాడుతోంది. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటుగా మిగతా బ్యాటర్లతో కాస్త బలంగానే కనిపిస్తోంది. కానీ పేస్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ఓ బలహీనత టీమిండియాను టెన్షన్ పెడుతోంది. భారత జట్టుకు మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, సిరాజ్ లతో పాటు మరికొంతమంది నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. కానీ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ లేడు. అర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండర్ బౌలరే అయినప్పటికీ.. అతడికి జట్టులో చోటు దక్కుతుందో? లేదో? చెప్పలేం.

అదీకాక వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో ఆడిన అనుభవం తక్కువ అర్షదీప్ కు. అయితే అతడి ప్రతిభ గురించి ఎలాంటి సందేహంలేదు. అర్షదీప్ అద్భుతమైన బౌలరే అయినప్పటికీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ లాంటి బ్యాటర్లపై ఎలాంటి ప్రభావం చూపగలడో చెప్పలేం. టీమిండియాలో ప్రస్తుతం ఉన్న షమీ, భువీ, బూమ్రా, సిరాజ్, ఉమ్రాన్ లు రైట్ హ్యాండ్ బౌలర్లు. వీరికి కాంబినేషన్ గా ఒక్క లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కూడా అందుబాటులో లేడు. అర్షదీప్ లా మరో బౌలర్ ఉంటే టీమిండియాకు అదనపు బలం చేకూరినట్లే. రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ బౌలింగ్ ఉంటే బ్యాట్స్ మెన్ లను ఇబ్బంది పెట్టవచ్చు. మిగతా జట్లలో రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ బలంగా ఉంది. ఆసీస్ జట్టులో ఈ పాత్రను తన భుజస్కంధాలపై మోసుకొస్తున్నాడు మిచెల్ స్టార్క్.

ఇక ఇదే పాత్రను పాక్ జట్టులో మోస్తున్నాడు షాహీన్ షా అఫ్రిది. ఇక గత వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్ లో ఈ పాత్రను ట్రెంట్ బౌల్ట్ అమోఘంగా పోషిస్తున్నాడు. దాదాపు మిగతా జట్లలో కూడా ఇలాంటి బౌలర్లు ఉండగా.. టీమిండియాలో మాత్రం కనిపించడంలేదు. గతంలో జహీర్ ఖాన్ లాంటి బౌలర్ ఈ పాత్రను ఎంతో అద్వితీయంగా పోషించాడు. కానీ ప్రస్తుతం జహీర్ ఖాన్ లాంటి బౌలర్ టీమిండియాకు లేడు. అదీకాక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లు బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో ముందుంటారనడంతో.. ఎలాంటి సందేహం లేదు. పైగా టీమిండియా పిచ్ లపై ఇలాంటి బౌలర్లు ఉండటం చాలా అవసరం. మరి టీమిండియాకు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ లేకపోవడం సమస్యగా మారుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: అనుష్కను చూసి హగ్ చేసుకోవడం నేర్చుకున్నా.. నవీన్ పొలిశెట్టి షాకింగ్ కామెంట్స్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి