iDreamPost

కూడబెట్టిన డబ్బు దొంగలపాలు కావొద్దని.. 2 లక్షలు భూమిలో పాతిపెట్టింది.. చివరకు

డబ్బును భద్రంగా దాచుకుందామనుకుంది. దానికోసం ఏకంగా భూమిలో గొయ్యి తవ్వి రూ. 2 లక్షలను పాతిపెట్టింది. కానీ ఆ తర్వాత అవి కనిపించలేదు. చివరికి ఏమైందంటే?

డబ్బును భద్రంగా దాచుకుందామనుకుంది. దానికోసం ఏకంగా భూమిలో గొయ్యి తవ్వి రూ. 2 లక్షలను పాతిపెట్టింది. కానీ ఆ తర్వాత అవి కనిపించలేదు. చివరికి ఏమైందంటే?

కూడబెట్టిన డబ్బు దొంగలపాలు కావొద్దని.. 2 లక్షలు భూమిలో పాతిపెట్టింది.. చివరకు

పూర్వ కాలంలో ఇప్పుడున్నట్లుగా బ్యాంకింగ్ వ్యవస్థ లేదు. తమ సొమ్ము దొంగల పాలు కావొద్దని ఏకంగా భూమిలో గొయ్యి తవ్వుకుని అందులో భద్రపర్చుకునే వారు. ఇటీవల అక్కడక్కడ తవ్వకాల్లో బయల్పడుతున్నటువంటి లంకె బిందెలు ఆ వ్యవహారానికి సంబంధించినవే. రాజుల కాలంలో భారీ మొత్తంలో బంగారం భూమిలో దాచిపెట్టారని.. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటనలు చాలానే చూశాం. అయితే ఇక్కడ ఓ అవ్వ కూడా అలాగే తన సొమ్మును భద్రంగా దాచుకోవాలని భావించి భూమిలో గొయ్యి తవ్వి అందులో రూ. 2 లక్షలు పాతిపెట్టింది. అలా భూమిలో దాచిన డబ్బు కనిపించకపోయే సరికి ఆందోళనకు గురైంది. ఈ ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది.

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం జగ్గు తండాకు చెందిన తమ్మిశెట్టి రంగమ్మ చిన్న కిరాణం కొట్టు నడుపుతూ జీవిస్తున్నది. అలా తినక, తాగక పైసా పైసా కూడబెట్టింది. ఇలా పోగేసిన డబ్బు కొంతకాలానికి రూ. 2 లక్షలు జమైంది. అయితే ఆ డబ్బును ఎవరికైనా ఇస్తే మళ్లీ తిరిగి ఇస్తారో లేదో, ఒకవేళ ఇంట్లోనే దాచి పెడితే ఎవరైనా దొంగిలిస్తారని భావించింది. ఈక్రమంలో ఇక ఆడబ్బును బ్యాంకులో దాచుకోవడం తెలియని రంగమ్మ తనకు వచ్చిన ఆలోచనను అమలు చేసింది. తన డబ్బును ఎవరికీ తెలియకుండా భూమిలో దాచిపెట్టాలనుకుంది. వెంటనే ఇంటి ఆవరణలో ఓ గొయ్యి తవ్వి ఆ రెండు లక్షల రూపాయలను ఓ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి గొయ్యిలో పాతిపెట్టింది.

Old lady who hid 2 lakhs in the land

డబ్బును భూమిలో పాతిపెట్టిన కొన్ని రోజుల తర్వాత రంగమ్మ ఊరికి వెళ్లింది. అనంతరం వచ్చిన వృద్ధురాలు డబ్బులు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. ఇక చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో సోమవారం వృద్ధురాలి ఇంటికొచ్చిన ఎస్సై ఉపేందర్‌.. తన సిబ్బందితో కలిసి ఇంటి ఆవరణలో వెతకగా భూమిలో పాతిపెట్టిన రూ.2 లక్షలు దొరికాయి. దీంతో రంగమ్మ ఊపిరి పీల్చుకుంది. పోయిందనుకున్న సొమ్ము దొరకడంతో ఆనందపడింది. అయితే వాస్తవానికి రంగమ్మ దాచిన ప్లేస్ లోనే ఆ డబ్బు ఉంది. కానీ ఆమె ఆందోళనలో మరిచిపోయి పెట్టిన చోటున కాకుండా వేరే ప్లేస్ లో వెతికిందని పోలీసులు వెల్లడించారు. ఎట్టకేలకు ఆ నగదును వృద్ధురాలికి ముట్టజెప్పారు. ఇంట్లో రక్షణ లేదని భావిస్తే డబ్బులను బ్యాంకులో దాచుకోవాలని ఈ సందర్బంగా పోలీసులు వృద్ధురాలికి సూచించారు. మరి నగదును భూమిలో దాచిపెట్టిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి