iDreamPost

పెళ్లై రెండేళ్లే.. ప్రాణంగా ప్రేమించే భర్త లేకపోయే సరికి..

ఆ భార్యా భర్తలది అన్యోన్య దాంపత్యం. చిలకా గోరింకల్లా ఉండేవారు. భార్యను అమితంగా ప్రేమించే భర్త అతడు. పతిని అర్థం చేసుకునే సతి ఆమె. కానీ వీరి పచ్చ సంసారంపై ఏ కన్ను పడిందో కానీ.. ఊహించని విధంగా

ఆ భార్యా భర్తలది అన్యోన్య దాంపత్యం. చిలకా గోరింకల్లా ఉండేవారు. భార్యను అమితంగా ప్రేమించే భర్త అతడు. పతిని అర్థం చేసుకునే సతి ఆమె. కానీ వీరి పచ్చ సంసారంపై ఏ కన్ను పడిందో కానీ.. ఊహించని విధంగా

పెళ్లై రెండేళ్లే.. ప్రాణంగా ప్రేమించే భర్త లేకపోయే సరికి..

కొన్ని సార్లు విధి వింత నాటకం ఆడుతూ ఉంటుంది. ఈ క్షణం మనది అనుకునే లోపు.. మనల్నే మనకు కాకుండా చేస్తోంది. ఊహించని విధంగా జీవితాన్ని మలుపు తిప్పుతుంది. చివరాకరు నామ రూపాలు లేకుండా చేయగల సత్తా కేవలం విధికి మాత్రమే ఉంది. కొన్ని సంఘటనలు చూస్తుంటే.. వీరి జీవితంపై విధి ఎందుకింత పగబట్టింది అనిపించకమానదు. వారిని వెంటాడుతూ, వేటాడుతూ ఉంటుంది. దీన్ని విధి అనుకోవాలో లేదా తలరాత అనుకోవాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉండిపోతుంటారు దెబ్బతిన్న వారు. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే భార్యా భర్తలది కూడా ఇలాంటి విషాద గాదే. ఊహించిన విధంగా కొన్ని గంటల్లోనే వారిని మృత్యువు కబళించింది.

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ జంటది అన్యోన్య కాపురం.. పెళ్లై ఎంతకాలం కాలేదు. పిల్లలు లేరు. చిలకా గోరికంల్లా సాగిపోతున్న వీరి కాపురంలోకి ఓ ప్రమాదం వచ్చి. పెను విషాదాన్ని మిగిల్చింది. రెండు రోజుల వ్యవధిలో భార్యా భర్తలు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. హృదయాన్ని ద్రవించే ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్‌లోని నివాస ముంటోంది దిలీప్ సుమంత్రయ్ కుటుంబం. అతడి భార్య పేరు సునా. వీరికి పెళ్లై కేవలం రెండేళ్లు అవుతుంది. ఇంకా పిల్లలు లేదు. హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో దిలీప్ సుమంత్రయ్ పనిచేస్తున్నాడు. రోజులాగే శుక్రవారం విధులకు హాజరయ్యాడు దిలీప్. ఔట్ డోర్ ఏసీ గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో కంటైనర్ పేలడంతో పెద్ద ప్రమాదం సంభవించింది.

 ఈ గ్యాస్ పేలుడు ఘటనలో దిలీప్‌తో పాటు ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. తీవ్ర గాయాలతో భర్త దిలీప్ మరణించాడు. అతడి మృతితో ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది భార్య సునా. తనను ప్రేమించే భర్త  ఇక లేడు, తిరిగి రాడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. గుండెలు పగిలేలా ఏడ్చింది. చివరకు అతడి లేని జీవితం తనకు వద్దని తీవ్ర నిర్ణయం తీసుకున్న సునా.. తన తండ్రి నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే భార్యా భర్తలు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. కొన్ని గంటల్లోనే దంపతులు కన్నుమూయడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరీ దీన్ని విధి అనాలా, తలరాత అనాలా.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి