iDreamPost

మళ్లీ అదే రచ్చ.. ఆర్ఆర్ఆర్ మెయిన్ హీరో ఎవరు?

హాలీవుడ్ క్రిటిక్స్ ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కొన్ని ఇంటర్నేషనల్ అవార్డులను కూడా గెలుచుకుంది. పలు విభాగాల్లో ఆస్కార్స్ నామినేషన్స్ లో సైతం చోటు దక్కించుకుంటుందని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా ఎంతో సంచలనం సృష్టిస్తుంటే..

హాలీవుడ్ క్రిటిక్స్ ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కొన్ని ఇంటర్నేషనల్ అవార్డులను కూడా గెలుచుకుంది. పలు విభాగాల్లో ఆస్కార్స్ నామినేషన్స్ లో సైతం చోటు దక్కించుకుంటుందని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా ఎంతో సంచలనం సృష్టిస్తుంటే..

మళ్లీ అదే రచ్చ.. ఆర్ఆర్ఆర్ మెయిన్ హీరో ఎవరు?

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శత్వంలో రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా మరే తెలుగు సినిమాకి రానంత గుర్తింపు ఈ చిత్రానికి వచ్చింది. హాలీవుడ్ క్రిటిక్స్ ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కొన్ని ఇంటర్నేషనల్ అవార్డులను కూడా గెలుచుకుంది. పలు విభాగాల్లో ఆస్కార్స్ నామినేషన్స్ లో సైతం చోటు దక్కించుకుంటుందని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా ఎంతో సంచలనం సృష్టిస్తుంటే.. ఎన్టీఆర్, చరణ్ అభిమానులు మాత్రం ఇప్పటికీ తమ హీరోదే మెయిన్ రోల్ అంటూ సోషల్ మీడియాలో గొడవ పడుతున్నారు.

ఆర్ఆర్ఆర్ ప్రకటన సమయంలో తారక్, చరణ్ కలయికలో మల్టీస్టారర్ సాధ్యమవుతుందా అని అనుకున్నారంతా. కానీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ టైమ్ లో తారక్, చరణ్ మధ్య బాండింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వారిద్దరూ అంత స్నేహంగా ఉంటుంటే.. వారి అభిమానులు మాత్రం ఒకరినొకరు శత్రువుల్లా చూసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలైనప్పటి నుంచి ఈ రచ్చ మొదలైంది. సినిమాలో తమ హీరో పాత్రే పవర్ ఫుల్ గా ఉందని చరణ్ ఫ్యాన్స్ అంటే.. ఇంటర్వెల్ సీన్, కొమరం భీముడో సాంగ్ చాలు తమ హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్లో చెప్పడానికి అంటూ తారక్ ఫ్యాన్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆస్కార్స్ పుణ్యమా అని వీరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది.

ఆస్కార్ నామినేషన్స్ లో బెస్ట్ యాక్టర్ విభాగంలో తారక్ చోటు దక్కించుకుంటాడని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. కొందరు క్రిటిక్స్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే చరణ్ ఫ్యాన్స్ మాత్రం నామినేషన్లలో ఉంటే మెయిన్ రోల్ చేసిన తమ హీరో ఉంటాడు గానీ, సైడ్ రోల్ చేసిన ఎన్టీఆర్ ఎలా ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తారక్ ఫ్యాన్స్.. అసలు ఆర్ఆర్ఆర్ సెకండాఫ్ ని యాక్టింగ్ తో నిలబెట్టిందే తమ హీరో అని, చరణ్ కి అసలు యాక్టింగ్ రాదని ట్రోల్ చేస్తున్నారు. ఇలా మొదలైన వీరి మధ్య గొడవ సోషల్ మీడియాలో బూతులతో తిట్టుకునే దాకా వెళ్లింది.

నిజానికి ఆర్ఆర్ఆర్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో గానీ, ఇతర ప్రతిష్టాత్మక క్రిటిక్స్ అసోసియేషన్స్ అవార్డ్స్ లో గానీ బెస్ట్ యాక్టర్ విభాగం నామినేషన్స్ లో చోటు దక్కలేదు. దానిని బట్టి చూస్తే ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచినా.. అది బెస్ట్ యాక్టర్ విభాగమయ్యే అవకాశాలు పెద్దగా లేవు. కానీ తారక్, చరణ్ అభిమానులు మాత్రం తమ హీరోనే మెయిన్ అంటూ అర్థంపర్థంలేని గొడవలు పడుతున్నారు. తమ హీరో నటించిన సినిమా ప్రపంచస్థాయిలో పేరు తెచ్చుకుంటుందని గర్వంగా చెప్పుకావాల్సింది పోయి.. ఇలా గొడవలు పడటం వల్ల ఇతర సినీ పరిశ్రమల ముందు చులకన అవ్వడం తప్ప మరే ప్రయోజనం ఉండదనే విషయం గ్రహిస్తే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి