iDreamPost

చంద్రబాబు అనుకూలమా..? వ్యతిరేకమా..?

చంద్రబాబు అనుకూలమా..? వ్యతిరేకమా..?

విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్‌ పెట్టే ప్రతిపాదనకు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అనుకూలమో లేదా వ్యతిరేకమో చెప్పాలని అధికారపార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రాంతాల మధ్య చంద్రబాబు విద్వేషాలు రేపుతున్నారని మండిపడ్డారు. ప్రజల మధ్య గోడవలు పెడుతున్న చంద్రబాబును అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాలన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌ రావు కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా ఉన్న నూతన ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్నీ అమరావతిలోనే ఉందాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ప్రతిపక్ష పార్టీల అధినేతల వాదనకు భిన్నంగా ఆయా పార్టీలలోని ప్రజా ప్రతినిధులు, నేతలు కొంత మంది మాత్రం మూడు రాజధానుల ఏర్పాటును సమర్థిస్తున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, కర్నూలు జిల్లా టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి