iDreamPost

ద్రవిడ్ స్థానంలో కొత్త హెడ్ కోచ్ గా టీమిండియా దిగ్గజం!

  • Author Soma Sekhar Updated - 08:18 PM, Sat - 28 October 23

వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ కు ద్రవిడ్ స్థానంలో ఓ కొత్త హెడ్ కోచ్ ను బీసీసీఐ నియమిస్తున్నట్లు సమాచారం. మరి ఆ కొత్త కోచ్ ఎవరు? పూర్తిగా కోచ్ పదవిలో ఉంటాడా? లేక ఆసీస్ టూర్ కే పరిమితం అవుతాడా? అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ కు ద్రవిడ్ స్థానంలో ఓ కొత్త హెడ్ కోచ్ ను బీసీసీఐ నియమిస్తున్నట్లు సమాచారం. మరి ఆ కొత్త కోచ్ ఎవరు? పూర్తిగా కోచ్ పదవిలో ఉంటాడా? లేక ఆసీస్ టూర్ కే పరిమితం అవుతాడా? అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Updated - 08:18 PM, Sat - 28 October 23
ద్రవిడ్ స్థానంలో కొత్త హెడ్ కోచ్ గా టీమిండియా దిగ్గజం!

వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక టీమిండియాను ముందుండి నడిపిస్తున్నాడు టీమిండియా దిగ్గజం, హెడ్ కోచ్ ద్రవిడ్. తన అపార అనుభవాన్నంతా ఉపయోగించి.. యువ క్రికెటర్లను సానపెడుతున్నాడు. అయితే ఈ వరల్డ్ కప్ తర్వాత ద్రవిడ్ కాంట్రక్ట్ ముగియనుంది. దీంతో టీమిండియా హెడ్ కోచ్ పదవిని ఎవరు అలంకరిస్తారా? అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ కు ద్రవిడ్ స్థానంలో ఓ కొత్త హెడ్ కోచ్ ను బీసీసీఐ నియమిస్తున్నట్లు సమాచారం. మరి ఆ కొత్త కోచ్ ఎవరు? పూర్తిగా కోచ్ పదవిలో ఉంటాడా? లేక ఆసీస్ టూర్ కే పరిమితం అవుతాడా? అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో వరల్డ్ కప్ బరిలోకి దిగిన టీమిండియా దుమ్మురేపుతోంది. వరస విజయాలతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ.. టైటిల్ రేసులో ముందుంది. ఇక తనదైన స్ట్రాటజీతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు టీమిండియా వాల్ ద్రవిడ్. టీమ్ లో ప్రయోగాలు చేస్తూ.. జట్టును అన్ని విధాలా సిద్దం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్ గా ద్రవిడ్ కాంట్రక్ట్ ముగుస్తుంది. దీంతో భారత జట్టుకు నెక్ట్స్ కోచ్ ఎవరు? అనేది చాలా మంది మనసుల్లో ఉన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కనిపిస్తుంది. వరల్డ్ కప్ ముగిసిన నాలుగు రోజుల్లోనే టీమిండియా 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను ఆసీస్ తో ఆడనుంది. 2024 వరల్డ్ కప్ ముందు భారత్ కు ఇది మంచి ప్రాక్టీస్ కూడా అవుతుంది.

కాగా.. ఆసీస్ తో జరిగే టీ20 సిరీస్ కు టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ను హెడ్ కోచ్ గా నియమించినట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న భారత జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరించాడు ఈ హైదరాబాదీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాహుల్ ద్రవిడ్ తన కాంట్రక్ట్ ముగిసిన తర్వాత మళ్లీ టీమిండియా హెడ్ కోచ్ పగ్గాలు స్వీకరించే అవకాశం ఉండకపోవచ్చు. అతడు కొంత విశ్రాంతిని తీసుకుని తన భవిష్యత్ ప్లాన్ చేసుకునే వీలుంది. దీంతో టీమిండియా నయా హెడ్ కోచ్ గా లక్ష్మణ్ పేరు ఏకగ్రీవం కావడం ఖాయమంటున్నారు కొందరు క్రీడా పండితులు. అయితే లక్ష్మణ్ ను కేవలం ఆసీస్ తో జరిగే టీ20 సిరీస్ వరకే కోచ్ గా కొనసాగిస్తారా? లేక పూర్తిస్థాయిలో కోచ్ గా నియమిస్తారా? అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి టీమిండియా హెడ్ కోచ్ గా లక్ష్మణ్ నియామకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి