iDreamPost

Volunteer: తీవ్ర విషాదం: గుండెపోటుతో వాలంటీర్‌ మృతి!

గుండె పోటు మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం వందల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, ఆంధ్ర ప్రదేశ్లోని కాకినాడ జిల్లాకు చెందిన ఓ వాలంటీర్‌ గుండెపోటు కారణంగా మరణించారు.

గుండె పోటు మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం వందల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, ఆంధ్ర ప్రదేశ్లోని కాకినాడ జిల్లాకు చెందిన ఓ వాలంటీర్‌ గుండెపోటు కారణంగా మరణించారు.

Volunteer: తీవ్ర విషాదం: గుండెపోటుతో వాలంటీర్‌ మృతి!

ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు బాగా ఎక్కువయ్యాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు గుండెపోటుకు బలవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఇండియాలోనూ గుండెపోటు మరణాలు భయాందోళనను కలుగ జేస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా.. ఆడుతూ పాడుతూ తిరిగిన వారు సైతం మరణిస్తున్నారు. కార్డియాక్‌ అరెస్ట్‌ల కారణంగా క్షణాల్లో ప్రాణాలు పోతున్నాయి. కార్డియాక్‌ అరెస్ట్‌ మరణాలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇక, అసలు విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటు కారణంగా ఓ వాలంటీర్‌ మృత్యువాతపడ్డాడు. కేవలం 24 ఏళ్లకే మరణించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన వేగి ఏసురాజు అనే 24 ఏళ్ల యువకుడు వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. ఏసురాజు ఎంతో చురుగ్గా ఉండేవాడు. అయితే, సోమవారం ఉదయం అతడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడ్ని గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు.

ఆర్‌ఎంపీ వైద్యుడు ఏసురాజుకు వైద్యం చేశాడు. అయితే, వైద్యం చేసినా ఏసురాజు ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. కొద్దిసేపటి తర్వాత స్ప్రహ కోల్పోయాడు. ఈ నేపథ్యంలో అతడ్ని హుటాహుటిన ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏసురాజును పరీక్షించిన వైద్యులు షాకింగ్‌ విషయం చెప్పారు. అప్పటికే రాజ చనిపోయినట్లు ధ్రువీకరించారు. గుండెపోటు కారణంగా అతడు చనిపోయినట్లు తెలిపారు. ఏసురాజు హఠాన్మరణంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఆదివారం రాత్రి వరకు ఎంతో చురుగ్గా అందరితో పాటు కలిసి తిరిగిన వ్యక్తి సోమవారం గుండెపోటు కారణంగా మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, గుండెపోటు కారణంగా గతంలోనూ చాలా మంది వాలంటీర్లు ప్రాణాలు కోల్పోయారు. సదుం మండలంలోని తిమ్మానాయనపల్లె పంచాయతీకి చెందిన ప్రసాద్‌ వాలంటీర్‌గా పనిచేసేవాడు. ఓ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తీరిగ్గా ఇంటి ముందు కూర్చుని విశ్రాంతి తీరుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.

దీంతో అతడ్ని సదుం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ప్రసాద్‌ మరణించినట్లు వైద్యులు తేల్చారు. గుండెపోటు కారణంగానే అతడు చనిపోయాడని తెలిపారు. వాలంటీర్‌ ప్రసాద్‌ గుండెపోటుతో మరణించే సమయానికి అతడి వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. ఇక, గతంలో మరణించిన వాలంటీర్ల వయసుతో పోల్చుకుంటే ఏసురాజు చాలా చిన్న వాడు. అతి చిన్న వయసులోనే గుండెపోటు కారణంగా మరణించడం విషాదం. మరి, గుండె పోటు కారణంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన వేగి ఏసురాజు అనే వాలంటీర్‌ మృతి చెందటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి