iDreamPost

వివాహ భోజనంబు రిపోర్ట్

వివాహ భోజనంబు రిపోర్ట్

ఏడాదిగా విడుదల కోసం ఎదురు చూసి ఫైనల్ గా ఓటిటి బాట పట్టిన వివాహ భోజనంబు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అఫీషియల్ డేట్ ఈ రోజు అయినప్పటికీ నిన్న రాత్రి నుంచే స్ట్రీమింగ్ లో పెట్టేశారు. సోనీ లివ్ సౌత్ సినిమాలు కొనడం మొదలుపెట్టాక విడుదల చేసిన టాలీవుడ్ ఫస్ట్ మూవీ ఇది. కమెడియన్ సత్య హీరోగా రూపొందిన ఈ లాక్ డౌన్ కామెడీ డ్రామాకు రామ్అబ్బరాజు దర్శకుడు. హీరో సందీప్ కిషన్ నిర్మాతగా మాత్రమే కాక చిన్న క్యామియో కూడా పోషించడంతో దీని మీద అంతో ఇంతో అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉన్న ఈ మూవీ ఫైనల్ గా మెప్పించిందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

మహా పిసినారి అయిన మధ్యతరగతి జీవి కం ఎల్ఐసి ఏజెంట్ మహేష్(సత్య)అందంగా లేకపోయినా డబ్బున్న అమ్మాయి అనిత(ఆర్జవి)ని ప్రేమిస్తాడు. ఆమె తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్)కి వీళ్ళ జంట ఏ మాత్రం ఇష్టం ఉండదు. అయితే అనిత తాతయ్య(సుబ్బరాయశర్మ)బలవంతం మీద ఒప్పుకుంటాడు. పెళ్లి మహేష్ తరఫున వాళ్లే చేయాలని కండిషన్ పెడతాడు. కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాక బంధువులు వెళ్లకుండానే కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించడంతో అందరూ అక్కడే ఇరుక్కు పోతారు. దీంతో వాళ్ళ పోషణ భారం మొత్తం మహేష్ మీద పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే అసలు స్టోరీ

సత్య తనవరకు క్యారెక్టర్ కు న్యాయం చేశాడు. ఇతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ టైమింగ్ దీనికి బాగా దోహద పడ్డాయి. ఎమోషనల్ సీన్స్ లో అంత బరువు మోయలేకపోయినా నీట్ గా మేనేజ్ చేశాడు. ఆర్జవి పర్వాలేదు. లుక్స్, యాక్టింగ్ రెండూ యావరేజే. సుదర్శన్ పంచులు అక్కడక్కడా పేలాయి. స్వర్గీయ టిఎన్ఆర్ ఇందులో ఒక పాత్ర చేశారు. కామన్ ఆడియెన్సు కి ఈజీగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అయినప్పటికీ దర్శకుడి తడబాటు వల్ల సెకండ్ హాఫ్ లో చాలా మటుకు మెప్పించేలా సాగదు. స్క్రీన్ ప్లే ల్యాగ్స్ తో పాటు ఇల్లాజికల్ సీన్స్ కొన్ని విసిగిస్తాయి. ఏదో ఇంట్లోనే టైం పాస్ కోసం చూస్తే ఓకే కానీ మరీ డోంట్ మిస్ క్యాటగిరీలోకి వివాహభోజనంబు చేరలేకపోయింది

Also Read : గూస్ బంప్స్ ఇచ్చే టెర్రిఫిక్ ఎపిసోడ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి