iDreamPost

కొత్త రిపోర్ట్: విటమిన్ల వాడ‌కంవ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు, ఖ‌ర్చు త‌ప్ప‌

కొత్త రిపోర్ట్: విటమిన్ల వాడ‌కంవ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు, ఖ‌ర్చు త‌ప్ప‌

విట‌మిన్స్ తీసుకొంటే చాలా స‌మ‌స్య‌లు తీరుతాయని చాలామంది అనుకొంటారు. అవ‌స‌రంలేదు. తీసుకొంటే ఎలాగూ న‌ష్ట‌మేమీ ఉండ‌దు. ఇది ఎక్కువ మంది అభిప్రాయం. కోవిడ్ సమ‌యంలోనే విట‌మిన్ టాబ్లెట్ల వాడ‌కం ఎక్కువైంది. తాజా ప‌రిశోధ‌న‌లు మ‌న‌ల్ని నిరాశ‌ప‌రిచే రిపోర్ట్ నిచ్చాయి. విట‌బిన్స్ వ‌ల్ల లాభంలేదు. ఎక్కువ‌గా తీసుకొంటే న‌ష్టాలున్నాయికూడా.

అమెరికా నుంచి ఇండియా వ‌ర‌కు పెద్ద‌వాళ్లందరిలో సగానికిపైగా విట‌మిన్ సప్ల‌మెంట్ల‌ను తీసుకొంటారు. తిండిలో కావాల్సిన పోష‌కాలులేక‌పోతే, విట‌మిన్స్ స‌ర్దుబాటుచేస్తాయి. విట‌మిట‌న్ టాబ్లెట్ల‌ను వాడుతున్న‌వాళ్ల‌ను అడగండి. వేసుకొంటే పోయేదేముంది. ఆరోగ్యానికి మంచిదేక‌దా! అని స‌మాధాన‌మొస్తుంది. ఈ మాట‌ను శాస్త్ర‌వేత్త‌లు ఒప్పుకోవ‌డంలేదు.

US ప్రివెంటివ్ సర్వీస్ టాస్క్ ఫోర్స్ (US Preventive Service Task Force- USPSTF) విడుదల చేసిన సిఫార్సుల ప్రకారం, ఆరోగ్యంతో ఉన్న‌వారిలో క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధుల నుండి విట‌మిన్ స‌ప్లమెంట్స్ రక్షణ కల్పిస్తాయన‌డానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఒక రకమైన సప్లిమెంట్ వాడ‌కానికి, క్యాన్సర్ మధ్య సంబంధాన్ని ఉంద‌ని తేల్చింది.

విట‌మిన్స్ వాడ‌టం వ‌ల్ల మీకు ఎలాంటి హానీ ఉండ‌ద‌నే అనుకొందాం. అలాగ‌ని వాటివ‌ల్ల లాభం కూడా లేదు. అంటే వాటిని వాడ‌టం వ‌ల్ల మీకు ఖ‌ర్చు పెరుగుతుంది. అలాగ‌ని మ‌ల్టీవిమిన్స్ తీసుకోవ‌ద్ద‌ని ఎవ‌రూ చెప్ప‌డంలేదు. ఒక‌వేళ వాటివ‌ల్ల లాభ‌ముంటే, ఏపాటికే వైద్య‌నిపుణులకు తెలిసి ఉంటుందిక‌దా!

84 వైద్య అధ్య‌య‌నాల సారంగా కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేశారు. విట‌మిన్లు, మిన‌రల్స్ వాడ‌టం వ‌ల్ల, లేదంటే మ‌ల్టీ విట‌మిన్స్ ను రెగ్యుల‌ర్ గా తీసుకోవ‌డం వ‌ల్ల‌ హార్ట్ డిసీజెస్ ను అడ్డుకోవ‌చ్చ‌నిగాని, కేన్స‌ర్ రాద‌ని కాని, అస‌లు అకాల మ‌ర‌ణం నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని ఎలాంటి ఆధారాలులేవు. అస‌లు విట‌మిన్స్ కు ఆరోగ్యానికి మ‌ధ్య సంబంధం చాలా కొద్దిగా, జ‌న‌ర‌ల్ గా చెప్పాలంటే ఏం లేద‌నే వైద్య‌నిపుణులు అంటున్నారు.

టాస్క్ ఫోర్స్ విటమిన్ ఇ(vitamin E ) బీటా-కెరోటిన్ సప్లిమెంట్స్(beta-carotene supplements) తీసుకోవ‌ద్ద‌ని సిఫార్స్ కూడా చేసింది. బీటా కెరోటిన్ అంటే శిలీంధ్రాలు, మొక్కలు, పండ్లలో ఎక్కువ‌గా ఎరుపు-నారింజ రంగులో ఉంటుంది దీన్ని మాన‌వ‌శ‌రీరం విటమిన్ ఎగా మార్చుతుంది. దీనివ‌ల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇంకో సంగ‌తి ఎక్కువ‌మంది భ్ర‌మ‌ప‌డుతున్న విటమిన్ ఇ సప్లిమెంట్ల వ‌ల్ల హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ లు త‌గ్గ‌వు.

మ‌రి విట‌మిన్, మిన‌ర‌ల్ స‌ప్ల‌మెంట్స్ అంటే ఎందుకింత వేలంవెర్రి? విట‌మిన్లు అంటే పోష‌కాలు. మ‌నం రోజూ తినే పండ్లు, కూరగాయలలో పుష్కలం. ఈ పోష‌కాలున్న విట‌మిన్స్ వాడితే హార్ట్ డిసీజెస్ బాగా త‌గ్గుతాయ‌న్న ప్ర‌చారాన్ని న‌మ్మ‌డ‌మే అస‌లు స‌మ‌స్య‌. సంపూర్ణ ఆహారంలో విట‌మిన్స్ ది కొద్దిపాత్ర మాత్ర‌మే. వాటితోపాటు ఫైటోకెమికల్స్, ఫైబర్,ఇతర పోషకాలు క‌ల‌గ‌ల‌సి, స‌మ‌న్వ‌యంతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలిస్తాయి. అవేమీ లేకుండా ఒక్క విట‌మిన్స్ తీసుకోవ‌డంవ‌ల్ల అలాంటి ప్ర‌యోజ‌నాలేవీ రావు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి