iDreamPost

Virgin Story : వర్జిన్ స్టోరీ రిపోర్ట్

Virgin Story : వర్జిన్ స్టోరీ రిపోర్ట్

నిన్న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తొమ్మిది సినిమాల దాకా హడావిడి చేశాయి కానీ మోహన్ బాబు సన్ అఫ్ ఇండియాతో సహా దేనికీ కనీస ఓపెనింగ్స్ దక్కకపోవడం ట్రేడ్ ని నిరాశపరిచింది. భీమ్లా నాయక్ కి ఇంకా వారం టైం ఉండటంతో అప్పటిదాకా ఇవి ఫీడింగ్ కి పనికొస్తాయన్న అంచనా పూర్తిగా తప్పింది. మౌత్ టాక్ నే నమ్ముకుని వచ్చిన వీటిలో యూత్ దృష్టిలో పడ్డ మూవీ వర్జిన్ స్టోరీ. టైటిల్ ఆ వర్గాన్ని ఆకట్టుకునేలా ఉండటంతో అంతో ఇంతో సందడి థియేటర్ల వద్ద కనిపించింది. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ శిరీషలు నిర్మించిన ఈ ఎంటర్ టైనర్ కు అచ్చు రాజమణి సంగీతం అందించారు. ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

తనను ప్రియుడు మోసం చేస్తున్నాడని గుర్తించిన అనుష్క(సౌమిక)అతనికి బుద్ధిచెప్పే ఉద్దేశంతో పబ్బులో కలిసిన విరాట్ అలియాస్ విక్రమ్ (విక్రమ్ సహిదేవ్)తో కలిసి వన్ నైట్ స్టాండ్ గడపాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఏకాంతంగా ఉండాలన్న వీళ్ళ నిర్ణయం ఊహించని మలుపులు దారి తీస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. కానీ ఊహించినంత అందంగా వీళ్ళ ప్రయాణం సాగదు. భావోద్వేగాలు లేకుండా ఉండాలన్న ఈ జంట ఆలోచన చివరికి ఏం చేసిందనేది స్క్రీన్ మీద చూడాలి. విక్రమ్ సహిదేవ్ క్యారెక్టర్ కు తగ్గట్టు యూత్ ఫుల్ గా చక్కగా చేశాడు. ఎటొచ్చి సౌమిక లుక్స్ పరంగా బాగానే ఉన్నప్పటికీ పెర్ఫార్మన్స్ పరంగా కొంత వీకే.

బాలీవుడ్ స్టైల్ లో దర్శకుడు ప్రదీప్ అట్లూరి చేసిన ఆలోచన వినడానికి బాగానే ఉంది కానీ దాన్ని రెండు గంటల పాటు ఎంగేజింగ్ మెటీరియల్ గా మార్చడానికి కావాల్సిన స్క్రీన్ ప్లే సరిగా సెట్ చేసుకోలేదు. దాంతో విపరీతమైన ల్యాగ్ తో ఫస్ట్ హాఫే సహనాన్ని పరీక్షిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ షార్ట్ ఫిలిమ్స్ లో బాగుంటాయి కానీ ఇలా బిగ్ స్క్రీన్ కి మార్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కామెడీ కూడా సరిగా పేలలేదు. తరుణ్ ఛాయాగ్రహణం, రెండు పాటలు అంతో ఇంతో కాపాడాయి. ఎంత యూత్ కోసమైనా వాళ్లకు డిజె టిల్లు లాంటి రేసీ ఎంటర్ టైనర్స్ అయితేనే నచ్చుతాయి. ఉట్టి టైటిల్ తో అట్రాక్ట్ చేస్తే లాభం లేదు. కంటెంట్ కావాలి

Also Read : Thalaivar 169 : రజినీకాంత్ కు తగ్గ హీరోయిన్ ఐశే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి