iDreamPost

Virat Kohli: ధోని అరుదైన రికార్డును చెరిపేసిన కోహ్లీ.. కింగ్​ కొత్త చరిత్ర!

  • Published Jan 23, 2024 | 6:54 PMUpdated Jan 23, 2024 | 6:54 PM

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడు కింగ్.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడు కింగ్.

  • Published Jan 23, 2024 | 6:54 PMUpdated Jan 23, 2024 | 6:54 PM
Virat Kohli: ధోని అరుదైన రికార్డును చెరిపేసిన కోహ్లీ.. కింగ్​ కొత్త చరిత్ర!

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి రికార్డులు కొత్త కాదు. 15 ఏళ్ల కెరీర్​లో క్రికెట్​లో ఉన్న ఎన్నో రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు కింగ్. కంటిన్యూస్​గా రన్స్ చేస్తూ మోస్ట్ సక్సెస్​ఫుల్ క్రికెటర్​గా నిలిచాడు. జెంటిల్మన్ గేమ్​కు ఐకాన్​గా మారిన విరాట్.. బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న చాలా రికార్డులను బ్రేక్ చేశాడు. మరికొన్నాళ్లు ఇదే ఊపును కొనసాగిస్తే క్రికెట్​లో బెస్ట్​గా చెప్పుకునే అన్ని రికార్డులను అతడు చెరిపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే అందుకు బాడీ సహకరించాలి. అదే టైమ్​లో ఫామ్​ కూడా కోల్పోకుండా ఉండాలి. ప్రస్తుతం అతడి ఫిట్​నెస్ లెవల్స్, ఫుట్ మూమెంట్స్ చూస్తుంటే ఈజీగా మరో మూడేళ్లు ఆడగలడని అనిపిస్తోంది. అలాంటి కింగ్ తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరు మీద ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా వన్డే టీమ్ ఆఫ్ ఇయర్​ను అనౌన్స్ చేసింది. ఈ జట్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా నియమించింది. ఇందులో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. కోహ్లీ తన కెరీర్​ బెస్ట్ ప్రపంచ కప్ ఆడాడు. మెగాటోర్నీ హిస్టరీలో ఒక సీజన్​లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్​గా నిలిచి రికార్డు క్రియేట్ చేశాడు. టాప్ స్కోరర్​గా నిలిచిన విరాట్ ఐసీసీ వన్డే టీమ్​లో స్థానం దక్కించుకున్నాడు. తద్వారా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని పేరు మీద ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు. ఐసీసీ టీమ్స్​లో అత్యధిక సార్లు స్థానం దక్కించుకున్న భారత క్రికెటర్​గా ధోనీ (13)ని కోహ్లీ (14) అధిగమించాడు. ఇది టీమిండియా క్రికెట్​లో నయా రికార్డు. విరాట్ అరుదైన ఘనతపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కోహ్లీ ఈజ్ గ్రేట్ అంటున్నారు. ఏ రికార్డు అయినా అతడికి దాసోహం అవ్వాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు.

అత్యధిక సార్లు ఐసీసీ టీమ్​లో చోటు దక్కించుకన్న కోహ్లీ రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. భవిష్యత్తులో దీన్ని ఎవరు బ్రేక్ చేస్తారనేది చూడాలి. ఇక, ఇంగ్లండ్​తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమయ్యాడు. పర్సనల్ రీజన్స్ వల్ల అతడు ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో అతడి ప్లేస్​లో మరో ఆటగాడ్ని తీసుకోవాలని టీమ్ మేఏజ్​మెంట్ అనుకుంటోంది. అయితే ఎవరికి ఛాన్స్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అతడి ప్లేస్​లో యంగ్ ప్లేయర్ శుబ్​మన్ గిల్ ఆడటం దాదాపు ఖాయమే. అయితే ఈ మధ్య కాలంలో గిల్ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆఖరి క్షణాల్లో ఇంకేమైనా మార్పులు చేస్తారేమో చూడాలి. ఇక, వ్యక్తిగత కారణాలతో దూరమైన కోహ్లీ ఇంగ్లండ్​తో మిగిలిన మూడు టెస్టులకు మాత్రం అందుబాటులో ఉంటాడు. మరి.. ధోని రికార్డును విరాట్ బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి