iDreamPost

Virat Kohli: రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికాకు దబిడిదిబిడే! కోహ్లీ ఎలా ప్రాక్టీస్‌ చేస్తున్నాడో చూడండి

రెండో టెస్టులో గెలిచి, సౌతాఫ్రికా గర్వాన్ని అణచాలని భావిస్తోంది టీమిండియా. అందుకోసం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్స్ లో ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ ను ప్రాక్టీస్ చేస్తూ, సిక్సులతో విరుచుకుపడుతున్నాడు.

రెండో టెస్టులో గెలిచి, సౌతాఫ్రికా గర్వాన్ని అణచాలని భావిస్తోంది టీమిండియా. అందుకోసం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్స్ లో ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ ను ప్రాక్టీస్ చేస్తూ, సిక్సులతో విరుచుకుపడుతున్నాడు.

Virat Kohli: రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికాకు దబిడిదిబిడే! కోహ్లీ ఎలా ప్రాక్టీస్‌ చేస్తున్నాడో చూడండి

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో ఘోర పరాభవం చవిచూసిన టీమిండియా.. ఎలాగైనా రెండో టెస్ట్ లో గెలిచి, సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. అందుకోసం ప్రణాళికలతో పాటుగా కఠోర సాధన చేస్తోంది. ఆటగాళ్లు నెట్స్ లో చమటోడుస్తున్నారు. సెంచూరియన్ నుంచి కేప్ టౌన్ చేరుకున్న భారత ప్లేయర్లు ప్రాక్టీస్ మెుదలుపెట్టారు. అందులో భాగంగా.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్స్ లో ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ ను ప్రాక్టీస్ చేస్తూ, సిక్సులతో విరుచుకుపడుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెండో టెస్టులో గెలిచి, సౌతాఫ్రికా గర్వాన్ని అణచాలని భావిస్తోంది టీమిండియా. ఇప్పటికే రెండో మ్యాచ్ వేదిక అయిన కేప్ టౌన్ కు చేరుకుని ప్రాక్టీస్ మెుదలుపెట్టింది. టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ కఠోరంగా శ్రమిస్తున్నాడు. నెట్స్ లో చమటలు చిందిస్తూ.. సిక్సులతో విరుచుకుపడుతున్నాడు. ప్రాక్టీస్ లో భాగంగా అశ్విన్ తో పాటు ఫాస్ట్ బౌలింగ్ లో సిక్సులు బాదిన వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. దీంతో నెక్ట్స్ మ్యాచ్ లో సౌతాఫ్రికా బౌలర్లకు దబిడిదిబిడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు విరాట్ ఫ్యాన్స్. ప్రాక్టీస్ లోనే ఇలా ఆడుతున్నాడు అంటే.. ఇక మ్యాచ్ లో ఏ రేంజ్ లో చెలరేగుతాడో అంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. తొలి టెస్ట్ లో కేఎల్ రాహుల్(101), విరాట్ కోహ్లీ(76) తప్ప మరే ఇతర బ్యాటర్ కూడా రాణించలేదు. దీంతో దారుణ ఓటమిని మూటగట్టుకుంది టీమిండియా. ఈ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుని నెక్ట్స్ టెస్ట్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని ఇటు భారత జట్టుతో పాటుగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి విరాట్ కోహ్లీ సిక్స్ ల ప్రాక్టీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి