iDreamPost

Virat Kohli: కోహ్లీని ఆకాశానికెత్తేసిన పాక్ మాజీ కెప్టెన్ భట్.. అతడు మామూలు మనిషి కాదంటూ..!

  • Published Jan 06, 2024 | 3:51 PMUpdated Jan 06, 2024 | 3:51 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆకాశానికెత్తేశాడు. విరాట్ అందరిలా మామూలు మనిషి కాదన్నాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆకాశానికెత్తేశాడు. విరాట్ అందరిలా మామూలు మనిషి కాదన్నాడు.

  • Published Jan 06, 2024 | 3:51 PMUpdated Jan 06, 2024 | 3:51 PM
Virat Kohli: కోహ్లీని ఆకాశానికెత్తేసిన పాక్ మాజీ కెప్టెన్ భట్.. అతడు మామూలు మనిషి కాదంటూ..!

గేమ్​లోనైనా నంబర్ వన్ ఎవరనే డిస్కషన్స్ ఎప్పుడూ నడుస్తుంటాయి. ఫలానా ఆటగాడే నంబర్ వని కొందరంటే.. కాదు, ఇతడే నంబర్ వన్ అని మరికొందరు అనడం చూస్తూనే ఉన్నాం. ఈ చర్చలు క్రికెట్​లోనూ జరుగుతాయి. ఎవరు నంబర్ వన్ క్రికెటర్ అనే డిస్కషన్స్​ నిత్యం జరుగుతూ ఉంటాయి. అయితే ఇందులో భారత్ డామినేషన్ అధికంగా ఉంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జెంటిల్మన్ గేమ్​లో కంటిన్యూ అయినన్ని రోజులు నంబర్ వన్ క్రికెటర్​గా కొనసాగాడు. ర్యాంకులతో సంబంధం లేకుండా తన క్లాసిక్ బ్యాటింగ్, సెన్సేషనల్ రికార్డ్స్​తో తోపు ప్లేయర్​గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నంబర్ వన్ ఎవరనేది చాన్నాళ్ల పాటు సస్పెన్స్​గా నిలిచింది. కానీ దీనికి ముగింపు పలుకుతూ అద్భుతమైన ఇన్నింగ్స్​లతో దూసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. అలాంటి కోహ్లీపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ మామూలు మనిషి కాదన్నాడు.

గత 15 ఏళ్లుగా కన్​సిస్టెంట్​గా రన్స్ చేస్తూ వరల్డ్ బెస్ట్ క్రికెటర్​గా విరాట్ కోహ్లీ గుర్తింపు సంపాదించాడు. అచ్చం సచిన్​లాగే ర్యాంకులతో సంబంధం లేకుండా బెస్ట్ ప్లేయర్​గా, తోపు బ్యాటర్​గా పేరు తెచ్చుకున్నాడు. అలాగని ర్యాంకుల్లో వెనుకబడలేదు. ర్యాంకింగ్స్​లో ఎప్పటికప్పుడు కోహ్లీ తన డామినేషన్ చూపిస్తూనే ఉంటాడు. అలాంటి విరాట్​ను పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆకాశానికెత్తేశాడు. కోహ్లీ అందరిలా మామూలు మనిషి కాదన్నాడు. అతడు అసలు సిసలైన వరల్డ్ నంబర్ వన్ అని ప్రశంసించాడు భట్. మ్యాచులకు కోహ్లీ ప్రిపేర్ అయ్యే తీరు, అతడి యాటిట్యూడ్, చేసే పని కోసం పరితపించే విధానం.. ప్రతిదీ అద్భుతమని కొనియాడాడు. విరాట్ మాట్లాడే తీరు కూడా అద్భుతమన్నాడు. కోహ్లీ మాటల్లో గేమ్​ మీద అతడికి ఉన్న నాలెడ్జ్ ఎంత ఎక్కువనేది తెలుస్తుందన్నాడు సల్మాన్ భట్.

‘కోహ్లీ మామూలు మనిషి కాదు. అతడు సిసలైన వరల్డ్ నంబర్ 1. అతడిలా కన్​సిస్టెంట్​గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్​లతో అలరించిందిన క్రికెటర్ ప్రపంచ క్రికెట్​లో మరొకడు లేడు. అది విరాట్​కు మాత్రమే సాధ్యం. అందుకే కోహ్లీ నంబర్ 1 అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అతడి లాంటి ప్లేయర్ భవిష్యత్​లో వచ్చే ఛాన్స్ కూడా లేదు’ అని సల్మాన్ భట్ స్పష్టం చేశాడు. భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్ గురించి కూడా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్​లో ఇద్దరు సౌతాఫ్రికా బ్యాటర్లను ముకేష్ కుమార్ త్వరగా పంపడం టీమిండియాకు కలిసొచ్చిందన్నాడు భట్. ఫామ్​లో ఉన్న డీన్ ఎల్గర్​తో పాటు టోనీ డీ జార్జి లాంటి డేంజరస్ ప్లేయర్​ను ముకేష్ ఔట్ చేయడం టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నాడు. ఆ తర్వాత పనిని జస్​ప్రీత్ బుమ్రా పూర్తి చేశాడని మెచ్చుకున్నాడు. బ్యాటింగ్​కు కష్టంగా మారిన పిచ్​పై ఎయిడెన్ మార్క్​రమ్ ఆడిన ఇన్నింగ్స్ సూపర్ అని ప్రశంసించాడు సల్మాన్ భట్. అయితే అతడు బాగానే ఆడినా భారత్​ను ఆపేందుకు అది సరిపోలేదన్నాడు. మరి.. కోహ్లీ గురించి సల్మాన్ భట్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: David Warner: 13 ఏళ్ల కెరీర్.. ఎన్నో ఘనతలు! ఆ ఒక్క మచ్చ తప్పితే.. మేలిమి వజ్రమే డేవిడ్ వార్నర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి