iDreamPost

Virat Kohli: కోహ్లీపై గంగూలీ షాకింగ్ కామెంట్స్.. కెప్టెన్సీ నుంచి తొలగించలేదంటూ..!

  • Author singhj Updated - 01:42 PM, Wed - 6 December 23

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కాంట్రవర్సీపై మరోమారు రియాక్ట్ అయ్యాడు బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ. అతడ్ని తాను తొలగించలేదన్నాడు. అలాగే మరికొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కాంట్రవర్సీపై మరోమారు రియాక్ట్ అయ్యాడు బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ. అతడ్ని తాను తొలగించలేదన్నాడు. అలాగే మరికొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

  • Author singhj Updated - 01:42 PM, Wed - 6 December 23
Virat Kohli: కోహ్లీపై గంగూలీ షాకింగ్ కామెంట్స్.. కెప్టెన్సీ నుంచి తొలగించలేదంటూ..!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలు, రికార్డుల గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. బ్యాట్స్​మన్​గా ఎవరూ సాధించని ఎన్నో అరుదైన ఘనతలను అతడు అందుకున్నాడు. లెజెండరీ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న అనేక రికార్డులను బ్రేక్ చేశాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో మాస్టర్ బ్లాస్టర్ 49 సెంచరీల రికార్డును కూడా అధిగమించాడు. మరో శతకం బాదడం ద్వారా 50 ఓవర్ల ఫార్మాట్​లో 50 సెంచరీల ఫీట్ నమోదు చేసిన తొలి క్రికెటర్​గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్, అతడి ఫిట్​నెస్​ చూస్తుంటే మరో నాలుగేళ్లు ఈజీగా ఆడేలా కనిపిస్తున్నాడు. అదే జరిగితే క్రికెట్​లో ఉన్న ఇంకా ఎన్నో రికార్డులు అతడి సొంతం అవుతాయని చెప్పొచ్చు.

బ్యాట్స్​మన్​గా ఇంతగా సక్సెస్ అయిన కోహ్లీ గతంలో భారత్​కు కెప్టెన్​గానూ వ్యవహరించిన సంగతి తెలిసిందే. సారథిగానూ జట్టును విజయవంతంగా ముందుకు నడించాడు. ఎన్నో సిరీస్​ల్లో టీమ్​ను గెలిపించాడు విరాట్. ఒకప్పుడు స్లెడ్జింగ్ అంటే టీమిండియా భయపడేది. కానీ కోహ్లీ కెప్టెన్ అయ్యాక భారత ప్లేయర్లపై కామెంట్ చేయడానికి కూడా ఇతర టీమ్స్ భయపడేవి. జట్టుకు దూకుడు నేర్పిన అతడు.. గేమ్, ఫిట్​నెస్​ విషయంలో తగ్గేదేలే అనేలా స్టాండర్డ్స్ సెట్ చేశాడు. కోహ్లీ ఫుల్​ ఫిట్​గా ఉంటూ ప్రతి మ్యాచ్​లోనూ రాణించడం ద్వారా టీమ్​లోని ఇతర ప్లేయర్స్​కు స్ఫూర్తిగా నిలుస్తూ వచ్చాడు. అతడి కెప్టెన్సీలో ఐసీసీ ట్రోఫీలు సాధించకపోయినా టీమ్ అన్ని ఫార్మాట్లలోనూ టాప్ లెవల్లో పెర్ఫార్మ్ చేసింది. కెప్టెన్​గా విరాట్ కోహ్లీ సక్సెస్​లో అప్పటి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పాత్ర చాలా కీలకం.

ఓటమితో సంబంధం లేదు.. అటాకింగ్ గేమ్​తో గెలవడానికే ప్రయత్నించాలంటూ టీమ్​ను మోటివేట్ చేసేవాడు రవిశాస్త్రి. అలా సక్సెస్​ఫుల్​గా జట్టును నడిపించారు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని అనూహ్య పరిణామాలతో కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. అయితే అప్పట్లో బీసీసీఐ ప్రెసిడెంట్​గా ఉన్న సౌరవ్ గంగూలీనే విరాట్​ను కెప్టెన్సీ నుంచి తప్పుకోమన్నాడనే కామెంట్స్ వినిపించాయి. దాదా వల్లే కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడనే రూమర్స్ వచ్చాయి. ఇప్పటికే దీనిపై పలుమార్లు గంగూలీ వివరణ ఇచ్చాడు. అయినా ఆ కాంట్రవర్సీ ఆయన్ను వదలడం లేదు. ఈ నేపథ్యంలో మరోమారు కోహ్లీ కెప్టెన్సీ ఎపిసోడ్ మీద ఆయన క్లారిటీ ఇచ్చాడు. కోహ్లీని తాను కెప్టెన్సీ నుంచి తప్పించలేదని గంగూలీ వివరణ ఇచ్చాడు. విరాట్ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పాడని.. దీంతో లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ మొత్తం నుంచి తప్పుకోవాలని మాత్రమే అతడికి సూచించానన్నాడు దాదా. కోహ్లీ మంచి కోసమే తాను ఆ సూచన చేశానన్నాడు.

కాగా, 2021లో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో విరాట్ మొదట టీ20లు, వన్డేల్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి పూర్తిగా వైదొలిగాడు రన్ మెషీన్. తనను కాంటాక్ట్ అవ్వకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తీసేశారంటూ అప్పట్లో విరాట్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తనను కెప్టెన్సీ నుంచి తీసేయడంలో దాదాదే కీలక పాత్ర అని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నామని కేవలం ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం ఇచ్చారని అన్నాడు. అప్పటి నుంచి కోహ్లీ-గంగూలీ మధ్య సత్సంబంధాలు లేవని అంటారు. మరి.. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తీసేయాలని తాను అనలేదంటూ దాదా క్లారిటీ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Team India: భారత్​తో సిరీస్​లో ఓటమి.. కుంటిసాకులు స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి