iDreamPost

యూపీలో టీచ‌ర్ బదిలీపై విద్యార్థుల క‌న్నీరు, ఈ వీడ్కోలు వీడియోతో సోషల్ మీడియా ఎమోష‌న‌ల్

యూపీలో టీచ‌ర్ బదిలీపై విద్యార్థుల క‌న్నీరు, ఈ వీడ్కోలు వీడియోతో సోషల్ మీడియా ఎమోష‌న‌ల్

చందౌలీలోని రాయ్‌గఢ్ ప్రాథమిక పాఠశాలలో, టీచ‌ర్ శివేంద్ర సింగ్(Shivendra Singh ) ఇటీవలే మరో స్కూల్ కు బదిలీ అయ్యారు. పాఠశాలలో అతనికి ఘ‌నంగా వీడ్కోలిచ్చారు. కాని, చివ‌ర్లో అత‌ను స్కూల్ ను వ‌దిలివెళ్తుంటే విద్యార్థులు త‌ట్టుకోలేక‌పోయారు. అతన్ని గ‌ట్టిగా కౌగిలించుకుని ఏడ్చేశారు. వ‌ద్దు సార్…వెళ్లొద్దు అంటూ అత‌న్ని ప‌ట్టుకున్నారు. సింగ్ ప‌రిస్థితికూడా అలాగే ఉంది. కాని వెళ్ల‌క‌త‌ప్ప‌దుక‌దా! నేను త్వరలో మ‌ళ్లీ వ‌స్తా. కష్టపడి చద‌వ‌మ‌ని వాళ్ల‌ను ఓదార్చాడు. కాని అత‌ను కూడా భావోద్వేగానికి లోనైయ్యాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్క‌వ‌మందిని క‌దిలించాయి. టీచ‌ర్ అంటే ఇలాగే ఉండాలి. ఎంత బాగా చ‌దువు చెప్ప‌క‌పోతే పిల్ల‌లు అత‌న్ని వ‌దిలిపెట్ట‌లేక‌పోతున్నార‌ని యూజ‌ర్లు కామెంట్స్ చేస్తున్నారు. సింగ్ చాలా స‌ర‌దాగా టీచ్ చేస్తాడు. పిల్ల‌ల‌కు ఆస‌క్తి క‌లిగేలా కొత్త త‌ర‌హాలో చెబుతాడ‌ని గ్రామ‌స్తులు అంటున్నారు. లాక్‌డౌన్‌ టైంలో ఆయ‌న అత‌ని టీచింగ్ టెక్నిక్ గురించి మిగిలిన టీచ‌ర్లూ మాట్లాడుకొనేవారు.

2018లో అసిస్టెంట్ టీచర్‌గా వ‌చ్చాడు. అతను పిల్లలను ఆట‌లు ఆడించాడు.. సోషల్ మీడియాను వాడాడు. మొద‌టి నుంచీ అక్క‌డ హాజ‌రు త‌క్కువ‌. అత‌నివ‌ల్ల ఎక్కువ మంది పిల్ల‌లు స్కూలు వ‌చ్చేవారు. ఆయన ప్రభావంతోనే స్కూల్‌ హాజరు శాతం పెరిగింది కూడా. ఇలాంటి టీచ‌ర్ సేవలను ఉపయోగించుకోవాలని, పక్క జిల్లాలోని ఓ స్కూల్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి