iDreamPost

విజయ్‌కాంత్‌కు అనారోగ్యం.. ఆ వార్తల్లో నిజం లేదు!

తమిళ ఇండస్ట్రీలో మాస్ హీరో, కెప్టెన్ విజయ్ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తర్వాత డీఎండీకే పార్టీ స్థాపించారు. గత కొంతకాంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

తమిళ ఇండస్ట్రీలో మాస్ హీరో, కెప్టెన్ విజయ్ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తర్వాత డీఎండీకే పార్టీ స్థాపించారు. గత కొంతకాంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

విజయ్‌కాంత్‌కు అనారోగ్యం.. ఆ వార్తల్లో నిజం లేదు!

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిగో తోక అంటే.. అదిగో పులి అన్న చందంగా వైరల్ న్యూస్ లు హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, క్రీడాకారులకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. సెలబ్రెటీలు హాస్పిటల్ కి వెళ్లినా.. అనారోగ్యానికి గురైనా వారు చనిపోయినట్లుగా వీడియోలు రావడంతో తాము బతికే ఉన్నాం మోర్రో అంటే వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఎలా పుట్టుకు వస్తున్నాయో అంటూ బాధపడుతున్నారు. ఇటీవల తమిళ నటుడు విజయ్ కాంత్ అనారోగ్యానికి గురికావడంతో రక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే..

తమిళ ఇండస్ట్రీలో పలు యాక్షన్ తరహా చిత్రాల్లో నటించిన విజయ్ కాంత్ తర్వాత డీఎండీకే పార్టీ స్థాపించి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.. ఈ క్రమంలోనే పార్టీకి, ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలు ఆయన సతీమని ప్రేమలత చూసుకుంటున్నారు. ఇటీవల ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్య రావడంతో చెన్నైలోని మియాట్ హాస్పిటల్ లో చేర్పించారు. ఇక సోషల్ మీడియాలో విజయ్ కాంత్ పై రక రకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలు, అభిమానుల్లో తీవ్ర ఆందోళన చెలరేగింది. అయితే విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత పుకార్లు నమ్మవొద్దని ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. ఆయన బాగానే ఉన్నారు.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇక విజయ్ కాంత్ ఆరోగ్యం మెరుగు పడిందని.. పుకార్లకు చెక్ పెడుతూ ఆయన నేడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత నెల 18న అనారోగ్యంతో మియాట్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఐసీయూలో చికిత్స పొందారు. ఒకదశలో ఆయన ఆరోగ్యం క్రిటికల్ గా ఉన్నప్పటికీ కోలుకొని తిరిగి ఇంటికి వెళ్లారు. గతంలో విజయ్ కాంత్ కి డయాబెటీస్ కారణంగా కుడికాలి మూడు వేళ్లు తొలగించిన విషయం తెలిసిందే. 71 ఏళ్ల వయసులో ఆయన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 2020లో ఆయనకు కరోనా పాజిటీవ్ వచ్చింది.. అయినప్పటికీ బతికి బయటపడ్డారు. అప్పట్లో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో సింగపూర్ లో చికిత్స తీసుకున్నారు. ఇక విజయ్ కాంత్ ఆరోగ్యంపై ఆయన సతీమణి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి