iDreamPost

F3 Movie : 30 ఏళ్ళ క్రితం కమెడియన్ చేసిన పాత్రలో హీరో

F3 Movie : 30 ఏళ్ళ క్రితం కమెడియన్ చేసిన పాత్రలో హీరో

అన్నీ అనుకూలంగా ఉండి ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లు లేకపోతే ఎఫ్3 రాబోయే సంక్రాంతికి ఖచ్చితంగా వచ్చేది. కానీ విపరీతమైన పోటీ మధ్య నలగడం ఇష్టం లేకపోవడంతో పాటు షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండటం వల్ల ఫిబ్రవరి 25కి వాయిదా వేసుకున్నారు. అప్పుడు రావడం కూడా అనుమానమేనని ఇన్ సైడ్ టాక్. దృశ్యం 2 సందర్భంగా జరిగిన ప్రమోషన్ ఈవెంట్ లో వెంకటేష్ ఇది సమ్మర్ ఎంటర్ టైన్మెంట్ ని చెప్పడం కొత్త డౌట్లను రేపింది. దీని సంగతలా ఉంచితే ఎఫ్3కి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపెలా ఉన్నాయి. ఎఫ్2ని కొనసాగింపని అన్నారు కానీ అందులో టచ్ చేయని చాలా అంశాలు ఇందులో చూపించబోతున్నారట.

వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోల స్వభావాలు. వెంకటేష్ ని రేచీకటి బాధితుడిగా చూపించబోతున్నట్టు దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించారు. 1992లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ చంటిలో బ్రహ్మానందం ఇదే తరహా పాత్రలో ఏ రేంజ్ లో కామెడీ పండించారో ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. కాకతాళీయంగా సరిగ్గా 30 ఏళ్ళ తర్వాత వెంకీ కూడా అదే క్యారెక్టర్ చేయడం అంటే విశేషమేగా. అసలు ఇలాంటి క్యారెక్టర్ లో ఆయన ఏ రేంజ్ లో చెలరేగిపోతారో వేరే చెప్పాలా. ఇక వరుణ్ తేజ్ కి ఈసారి నత్తిని జోడించినట్టు తెలిసింది. ఒకవైపు నత్థి మరోవైపు కలర్ బ్లైండ్ నెస్ ఊహించుకుంటేనే పొట్ట చెక్కలయ్యేలా ఉంది.

ఎఫ్3 మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. క్లైమాక్స్ ని 35 నటీనటులతో పది రోజుల పాటు షూట్ చేశారంటేనే అవుట్ ఫుట్ ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. చేసిన అయిదు సినిమాల్లో ఫ్లాప్ లేకుండా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి దీంతో డబుల్ హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు. ఎఫ్3 అయ్యాక బాలకృష్ణతొ చేయబోయే ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుంది. సరిలేరు నీకెవ్వరూ తరహాలో కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ గా స్క్రిప్ట్ ని ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. రామారావుగారు టైటిల్ తో గతంలో అనుకున్నారు కానీ ఇప్పుడు రవితేజ ఆ పేరుతో రాబోతున్నాడు కాబట్టి ఆ ఛాన్స్ దాదాపు లేనట్టే

Also Read : Kaikala Satyanarayana : మా కాల‌పు మ‌హావిల‌న్ “కైకాల‌”

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి