iDreamPost

వందే భారత్ రైలు ఢీ కొని తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి

వరుస రైలు ప్రమాద ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాద ఘటన మర్చిపోక ముందే విజయనగరంలో మరో ప్రమాదం సంభవించింది. ఈ రైలు ప్రమాదాల ఘటనల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

వరుస రైలు ప్రమాద ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాద ఘటన మర్చిపోక ముందే విజయనగరంలో మరో ప్రమాదం సంభవించింది. ఈ రైలు ప్రమాదాల ఘటనల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

వందే భారత్ రైలు ఢీ కొని తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి

ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఒడిశాలోని బాలా‌సోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. ఈ రైలు ఘటన మర్చిపోక ముందే.. విజయనగరంలో మరో యాక్సిడెంట్ కలవర పాటుకు గురి చేస్తుంది. ఏదో ఒక రైల్వే ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రైలు పట్టాలు తప్పడం, బోగీల్లో మంటలు చెలరేగడం, క్రాసింగ్, రెండు రైళ్లు గుద్దుకోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న తమిళనాడులో ముగ్గురు చిన్నారులు (చెవిటి, మూగ) పట్టాలపై ఆడుకుంటుండగా లోకల్ ట్రైన్ ఢీ కొనడంతో చనిపోయారు.

రైల్వే క్రాసింగ్ చేస్తుండగా.. వందేభారత్ రైలు ఢీకొని తల్లీ, కుమార్తెలు మరణించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో కాసమ్ పూర్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. కంకర్ ఖేరాకు చెందిన నరేశ్ అనే వ్యక్తి.. తన భార్య మోనా, కుమార్తెలు మనీషా, చారులను రిక్షాపై ఎక్కించుకుని వస్తున్నాడు. కాసమ్ పూర్ వద్ద రైల్వే గేటు వేయడంతో రిక్షాలోనే వారిని కూర్చొబెట్టి.. పట్టాలు దాటించేందుకు ప్రయత్నంచాడు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న వందే భారత్ రైలు, రిక్షా వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో.. ఘటనా స్థలిలోనే తల్లి మోనా, కుమార్తెలు మనీషా, చారు మరణించారు. ఈ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు భర్త నరేష్.

అతడికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఢిల్లీ నుండి డెహ్రాడూన్‌కు వెళుతున్న వందేభారత్ రైలు రావడాన్ని గమనించిన అతడు.. రిక్షా దిగి భార్యా బిడ్డలను రక్షించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. రైలు రిక్షాను ఢీకొట్టింది. ముగ్గురు మరణించారు. రైల్వే గేటు మూసి ఉన్నా.. దాటేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో నరేష్ కుటుంబాన్ని కోల్పోయి.. ఒంటరి వాడు అయ్యాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి