iDreamPost

సొంత అన్న య్యని.. రెండో పెళ్లి చేసుకున్న చెల్లి! ఇండియాలో ఇదేమి ఖర్మ!

Women Married her Own Brother: ఈ మద్య డబ్బు కోసం జనాలు ఎలాంటి మోసాలకైనా తెగబడుతున్నారు. డబ్బు కోసం ఏకంగా ఓ మహిళ చేసిన పని సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.

Women Married her Own Brother: ఈ మద్య డబ్బు కోసం జనాలు ఎలాంటి మోసాలకైనా తెగబడుతున్నారు. డబ్బు కోసం ఏకంగా ఓ మహిళ చేసిన పని సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.

సొంత అన్న య్యని.. రెండో పెళ్లి చేసుకున్న చెల్లి! ఇండియాలో ఇదేమి ఖర్మ!

ఇటీవల కొంత మంది డబ్బు కోసం ఎలాంటి దారుణాకైనా పాల్పపడుతున్నారు. లగ్జరీ జీవితాలకు అలవాటు పడిన వారు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాలోచనతో ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకువస్తుంది. ఈ పథకాలు పేదరికంలో ఉన్న లబ్దిదారులకు ఉపయోగపడేలా ఉండాలని చూస్తున్నప్పటికీ కొంతమంది అక్రమార్కులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. డబ్బు కోసం ఓ మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. సభ్యు సమాజం తలదించుకునేలా చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం  ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా  సామూహిక వివాహ యోజన పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకాన్ని దుర్వినియో పరుస్తూ ఓ మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది.  తనకు పెళ్లైనప్పటికీ.. సొంత సోదరుడిని మళ్లీ వివాహం చేసుకుంది. ఈ విషయం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.  వివరాల్లోకి వెళితే.. మహరాజ్ గంజ్ జిల్లాలో  ముఖ్యమంత్రి సామూహిక వివాహలకు సంబంధించిన పథకం కింద పెళ్లైన జంటలకు గృహోపకరణాల కోసం రూ.35 వేలు అంజేస్తున్నారు. ఆర్థికంగా వెనుబడిన వర్గాల కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చారు.   ఈ స్కీమ్ లో కొన్ని అక్రమాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి.

ఈ నెల మార్చి 5న మహారాజ్‌గంజ్‌లోని లక్ష్మీపూర్ బ్లాక్‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 38 జంటలకు పెళ్లి జరిగింది. కొంతమంది ఈ పథకం ద్వారా లబ్ది పొందాలని ఓ మహిళకు రెండో వివాహం చేయ నిశ్చయించారు. ఆ మహిళకు అప్పటికే పెళ్లైంది.  పెళ్లి రోజున అనుకున్నట్లుగా పెళ్లి కొడుకు మండపం వద్దకు రాలేకపోయాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక వరుడి స్థానంలో ఆమె సోదరుడితో సంప్రదాయ ఆచారాలతో వివాహ వేడుకను నిర్వహించారు.  ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మహరాజ్ గంజ్‌లోని ఏరియా డెవలప్ మెంట్ ఆఫీసర్ వారికి ఇచ్చిన వస్తువులను తిరిగి పొందాలని తక్షణమే వారిపై చర్య తీసుకోవాలని ఆదేశించారు.  ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి సామూహి వివాహ పథకంలో ఇలాంటి ఘటన జరగడం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి