iDreamPost

Bigg Boss 7 Telugu: మరోసారి బూతు పంచాయితీ.. అసలు ఇందులో తప్పు ఎవరిది?

బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాలుగా బూతు పంచాయితీ ఒకటి నడుస్తోంది. గతవారంలో జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పటికీ హౌస్ లో పంచాయితీ చేస్తూనే ఉన్నారు. అదే కారణం మీద ఇంకా నామినేట్ చేస్తున్నారు. అయితే అసలు ఈ మొత్తం గొడవలు తప్పు ఎవరిది?

బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాలుగా బూతు పంచాయితీ ఒకటి నడుస్తోంది. గతవారంలో జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పటికీ హౌస్ లో పంచాయితీ చేస్తూనే ఉన్నారు. అదే కారణం మీద ఇంకా నామినేట్ చేస్తున్నారు. అయితే అసలు ఈ మొత్తం గొడవలు తప్పు ఎవరిది?

Bigg Boss 7 Telugu: మరోసారి బూతు పంచాయితీ.. అసలు ఇందులో తప్పు ఎవరిది?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట అయితే రసవత్తరంగానే సాగుతోంది. కానీ, ఈ బూతు పంచాయితీ మాత్రం వస్తూనే ఉంది. ఎవరికి వాళ్లు నీతులు చెప్తున్నారు. కానీ, చివరికి మాత్రం బూతులే మాట్లాడుతున్నారు. కొందరేమో బూతులు మాట్లాడితే సహించం అంటూ పోరాటాలు చేస్తారు. కానీ, వేరే వాళ్లు మాట్లాడినప్పుడు మాత్రం కళ్లప్పగించి చూస్తూ ఉంటారు. గత రెండు వారాలుగా హౌస్ లో ఈ బూతు పంచాయితీ జరుగుతూనే ఉంది. మరోసారి ఈ వారం నామినేషన్స్ లో కూడా అదే రచ్చ మొదలైంది. అయితే అసలు ఈ బూతు పంచాయితీలో తప్పు ఎవరిదో ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్  సమయంలో శోభా రెచ్చగొట్టే మాటలు, చేతలు చేసిన సమయంలో భోలే షావలి ఒక అనకూడని మాటను అన్నాడు. అందుకు ప్రియాంక సింగ్ అఫెండ్ అయ్యింది. అలా అనడం తప్పు అంటూ గొడవ కూడా చేసింది. ఆ సమయంలో థూ అంటూ నోరు కూడా జారింది. అయితే బిగ్ బాస్ కూడా అంత అయ్యాక కలగజేసుకుని భోలే అలా మాట్లాడటం తప్పు అని చెప్పారు. భోలే షావలి తప్పును ఒప్పుకుని క్షమాపణ కూడా చెప్పాడు. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు చాలాసార్లు క్షమాపణ చెప్పాడు. వీకెండ్ లో నాగార్జున ముందు కూడా తన తప్పును ఒప్పుకుని అందరికీ సారీ చెప్పాడు. అక్కడితో ఆ గొడవను వదిలేసి ఉంటే ఏ గోలా ఉండేది కాదు. ఎందుకంటే సహజంగా దాదాపుగా చాలా మంది బయట కొన్ని అన్ పార్లమెంటరీ భాషను వాడుతూ ఉంటారు.

ఫ్రెండ్స్ తో కిలిసినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, ఆనందంలో కూడా అలాంటి మాటలు అనేస్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ లాంటి ఒక షోలో అనకూడని మాటే అది. అదే విషయాన్ని ఒప్పుకుని క్షమాపణ కూడా చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటికీ శోభాశెట్టి.. భోలేని మాత్రం క్షమించను అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా నామినేషన్ లో శివాజీ శోభాని నామినేట్ చేస్తూ అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. మనుషులు తప్పులు చేయడం సహజం, తప్పు తెలుసుకుని క్షమాపణ కూడా చెప్పాడు కానీ, ఎందుకు అతడిని మన్నించడం లేదు అంటూ ప్రశ్నించాడు. అందుకు శోభాశెట్టి అయితే విచిత్రమైన హావభావాలు, మాటలతో చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది. తనలో ఉన్న మోనితాను బయటకు తీసుకొచ్చి గట్టిగానే గోల చేసింది. రా వచ్చి కూర్చో.. అంటూ తర్వాత భోలేని హేళనగా కూడా మాట్లాడింది.

ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే.. హౌస్ లో ఇన్నిరోజులు చాలా మంది చాలానే మాటలు జారారు. వాటి అన్నింటిపై ఎందుకు ఎవరూ ఇంత గోల చేయలేదు? గౌతమ్ కి ఎక్కడో కాలుతుంది అంటూ కామెంట్ చేశాడు.. అప్పుడు ఎవరూ అఫెండ్ కాలేదు. ఆ తర్వాత ధామినీ అయితే F పదం నా ఊతపదం అంది అప్పుడూ వీళ్లెవరికీ ఇబ్బంది కలగలేదు. అశ్వినీ కూడా ఇంగ్లీష్ లో మాటలు అనేసింది అందుకు నాగార్జున కూడా అభ్యంతరం చెప్పారు. కానీ, హౌస్ లో ఉన్న వాళ్లు మాత్రం ఏం చెప్పలేదు. ఇంక సందీప్ మాస్టర్ నాలుక కోస్తా అన్నాడు అని శివాజీ చెప్పాడు.. ఆ మాటతో కూడా ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ, భోలే అన్న మాటే బూతు అన్నట్లు వీళ్లంతా గోల చేస్తున్నారు. ముఖ్యంగా శోభా అయితే నిన్ను క్షమించను అని తెగేసి చెప్పింది. అసలు భోలే అనే ఒక వ్యక్తి ఉన్నట్లు తన మైండ్ లో కూడా లేదు అంటూ సెటైర్లు కూడా వేసింది.

మరి.. ఇదే శోభా, ఇదే ప్రియాంక, ఇదే సందీప్, ఇదే హౌస్ మేట్స్ కి మిగిలిన వాళ్లు మాట్లాడినప్పుడు ఎందుకు కోపం రాలేదు? ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఎందుకు వీళ్లు అప్పుడు లైట్ తీసుకున్నారు? ఇప్పుడు ఎందుకు దీన్ని రెండు వారాలుగా పంచాయితీ చేస్తున్నారు? అది వాడకూడని పదం అని మీరే చెప్తున్నారు. మరి.. అలాంటి పదం గురించి ఎందుకు ఇన్నిరోజులు పంచాయితీ చేయాలి? ఏదైనా తప్పు చేసి దోషిగా రుజువై, శిక్ష అనుభవించిన తర్వాత వారిని దోషి అనకూడదు. అలాగే భోలే కూడా తాను చేసిన తప్పుని ఒప్పుకుని క్షమాపణ కూడా చెప్పాడు. తిరిగి అలా చేయను అని మాట కూడా ఇచ్చాడు. కాబట్టి హౌస్ మేట్స్ ఈ బూతు పంచాయితీని ఇక్కడితో ఆపేస్తే ప్రేక్షకులు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఈ మొత్తం బూతు పంచాయితీలో ఆ మాట మాట్లాడటం బోలే చేసిన తప్పు. దానిని ఇన్ని రోజులు సాగదీస్తూ రావడం శోభా చేసిన తప్పు. దానిని కారణంగా చూపించి నామినేషన్స్ చేయడం హౌస్ మేట్స్ చేస్తున్న తప్పు. మరి.. బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న ఈ బూతు పంచాయితీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి