iDreamPost

ప్రజలకు గుడ్ న్యూస్.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్

Union Budget 2024 Highlights & Analysis in Telugu: గురువారం కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలోనే ప్రజలకు ఓ శుభవార్త చెప్పారు.

Union Budget 2024 Highlights & Analysis in Telugu: గురువారం కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలోనే ప్రజలకు ఓ శుభవార్త చెప్పారు.

ప్రజలకు గుడ్ న్యూస్.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్

గురువారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశ ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూసిన ఘట్టం రానే వచ్చింది. బడ్జెట్ లో ఎలాంటి అంశాలు ఉంటాయని, తమకు ఏ విధంగా అనుకూలంగా ఉంటాయా అని ఎదురు చూశారు. ఇలాంటి తరుణంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. అలానే బడ్జెట్ ప్రసంగంలో.. ఈ పదేళ్లలో దేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో వివరించారు. అంతేకాక పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కీలక ప్రకటనలు చేశారు. అంతేకాక ఆమె ప్రజలకు ఓ గుడ్ న్యూస్ ను కూడా చెప్పారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. త్వరలో లోక్ సభ  ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక లోక్ సభలో కేంద్ర  ఆర్థిక మంత్రి డిజిటల్ రూపంలో బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు. “ఇది ప్రజల బడ్జెట్, గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతిని సాధిస్తోంది. ప్రధాని మోదీ సార్థ్యంలో భారత్ ఆర్థిక  వ్యవస్థ పరుగులు తీస్తోంది. దేశంలోని ప్ర జలందరూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. పదేళ్లలో ఆర్థిక స్థితి ఉన్నత స్థాయికి చేరుకుంది” అని ఆమె తెలిపారు.

ఇక ఈ బడ్జెట్ ప్రకారం.. కొత్త పన్ను విధానంతో రూ.7 లక్షల వరకు టాక్స్ లేదు. అలానే ఉద్యోగుల కోసం స్టాండర్డ్ డిడెక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. ప్రత్యక్ష పనులు మూడు రెట్లు పెరిగినట్లు మంత్రి పేర్కొన్నారు. అలానే ఈ ఏడాది రూ.26.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సర రెవెన్యూ ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు ఉన్నట్లు మంత్రి తెలిపారు. అలానే ఈ ఏడాది ద్రవ్యలోటు 5.8 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఇక తన ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. రూఫ్ టాప్ సోలార్ విధానం కింద కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు.

విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి పొందేందుకే ఈ సోలార్ పథకం ప్రకటించినట్లు ఆమె  చెప్పారు. అలాగే సొంత ఇళ్లులేని పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి  కూడా ఆర్థిక మంత్రి తీపి కబురు చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్లనున్నట్లు తెలిపారు. దీని ద్వారా బస్తీలు, అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న వారి సొంతింటి కలను సాకారం చేస్తామని ఆమె తెలిపారు.  అలాగే పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సమగ్ర కార్యక్రమం చేపడతామని చెప్పుకొచ్చారు.

పంటలకు నానో యూరియా తర్వాత నానో డీఏపీ కింద ఎరువు అందజేస్తామన్నారు. ఇదే సమయంలో రాష్ట్రాలకు కూడా ఓ మంచి వార్త చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణల అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు రూ.75,000 కోట్ల వడ్డీలేని రుణాలను అందిస్తామని ప్రకటించారు. మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్ల కేటాయింపులు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మరి.. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి