iDreamPost

ఒక్కరు దొరక్క సింగిల్స్ అల్లాడుతుంటే.. ఈ అంకుల్ 250 మంది అమ్మాయిల్ని..

గతంలో పెళ్లిళ్లు ఇలా చూడగానే అలా సెట్ అయిపోయేవి. కానీ నేడు అంతా సెట్ అయ్యాకే అనే మాట వినిపిస్తోంది. దీంతో ఏజ్ బార్ అయిపోతుంది. వివాహాలు కావడం లేదు. దీంతో...

గతంలో పెళ్లిళ్లు ఇలా చూడగానే అలా సెట్ అయిపోయేవి. కానీ నేడు అంతా సెట్ అయ్యాకే అనే మాట వినిపిస్తోంది. దీంతో ఏజ్ బార్ అయిపోతుంది. వివాహాలు కావడం లేదు. దీంతో...

ఒక్కరు దొరక్క సింగిల్స్ అల్లాడుతుంటే.. ఈ అంకుల్ 250 మంది అమ్మాయిల్ని..

ఇప్పుడు దేశంలో బ్యాచులర్ సంఖ్య పెరిగిపోతుంది. 30 ఏళ్లు నిండుతున్నా వివాహాలు కావడం లేదు. అబ్బాయిలే కాదూ.. అమ్మాయిలు కూడా ముప్పది వయస్సు వచ్చేంత వరకు తమ వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు. చదువు, కెరీర్ అంటూ వివాహ తంతును పోస్ట్ పోన్ చేస్తున్నారు. దీంతో పెళ్లి ఈడు దాటాక.. సంబంధాలు రావడం లేదు. ఇలాంటి వారి కోసమే వచ్చాయి మ్యాట్రిమోనీ సంస్థలు. తమ ఫ్రొఫైల్ పెడితే చాలు.. దానికి తగ్గ సంబంధాలు ఒక్కొటి కాదూ.. వేలల్లో చూసుకోవచ్చు. దీంతో పెళ్లికాని ప్రసాదులు, అమ్మాయిలు.. తమకు తగ్గ వధువు, వరుడు కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో కేటుగాళ్లు.. మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ ప్రొఫైల్ లో బురిడీ కొట్టిస్తున్నారు. అలా నిత్య పెళ్లికొడుకు, నిత్య పెళ్లికూతుర్ల బాగోతాలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే గురుడు మాత్రం.. మామూలోడు కాదూ.. మహా ముదురు

ఒక్కరు దొరక్క బ్యాచులర్స్ అల్లాడిపోతుంటే..  సుమారు 250 మంది మహిళల్ని, యువతుల్ని మోసం చేశాడు ఈ అంకుల్. తన 25 ఏళ్ల ఫోటోను మ్యాటిమోనీల్లో ఉంచి.. తనకు పెళ్లి కాలేదని మోసం చేశాడు. ఎట్టకేలకు ఇతడి బండారం బయటపడింది. పోలీసులు పట్టుకోవడంతో.. కేటుగాడి గుట్టురట్టు అయ్యింది. ఇంతకు ఈ ఖతర్నాక్ అంకుల్ ఎక్కడవాడంటే.. కర్ణాటక రాజధాని బెంగళూరు వాసి. అతడి పేరు.. నరేష్ పూరి గోస్వామి. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో నకిలీ ఖాతాలు సృష్టించి, నకిలీ ఫ్రొఫైల్‌తో మహిళల్ని చీట్ చేశాడు. ముఖ్యంగా వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్. ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారిగా చెప్పుకుంటూ అనేక మంది మహిళల్ని మోసం చేశాడు. పెళ్లి చర్చల కోసం కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు ఓ మహిళను పిలిపించాడు. ఆ తర్వాత టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకోవాలని, వాలెట్ ఇంట్లో మర్చిపోయానంటూ.. ఆమె నుండి డబ్బులు తీసుకున్నాడు. ఆమెకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని బెంగళూరు సిటీ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడు నరేష్ గోస్వామిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగు చూసింది. అతడి వద్ద రెండు సిమ్ కార్డులను గుర్తించారు పోలీసులు. అలాగే పత్రికల్లో వధువు కావాలి అంటూ ప్రకటనలు కూడా చేయించినట్లు గుర్తించారు. ఓ వాట్సప్ గ్రూపులో కూడా జాయిన్ అయ్యి.. మహిళల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వారితో ఫోనులో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అందినకాడికి దోచేసేవాడు. విచారణలో రాజస్థాన్‌కు చెందిన 56 మంది, ఉత్తరప్రదేశ్‌లో 32 మంది, ఢిల్లీలో 32 మంది, కర్ణాటకలో 17 మంది, మధ్యప్రదేశ్‌కు చెందిన 16 మంది, మహారాష్ట్రలో 13 మంది, గుజరాత్‌కు చెందిన 11 మంది మహిళల్ని మోసం చేసినట్లు తేలింది. చాలా మంది మహిళలను చీట్ చేశాడని, ఇంకా వెలుగులోకి రావాల్సినవి చాలా ఉన్నాయని పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి