iDreamPost

రూపాయి ఎక్కువ తీసుకున్నా.. రూ.50 వేలు జరిమానా కట్టాల్సిందే!

Aadhaar Services: దేశంలోని పలు చోట్ల ఆధార్‌ కార్డ్‌ అప్‌ డేట్‌ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

Aadhaar Services: దేశంలోని పలు చోట్ల ఆధార్‌ కార్డ్‌ అప్‌ డేట్‌ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

రూపాయి ఎక్కువ తీసుకున్నా.. రూ.50 వేలు జరిమానా కట్టాల్సిందే!

ఆధార్ కార్డు గురించి తెలియని వారు ఉండరు. ఈ కార్డు భారత పౌరులకు అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే స్కీమ్స్ అందాలంటే.. ఈ కార్డు తప్పనిసరి. ఇక బ్యాంకు ఖాతా తెరవాలన్నా,క్రెడిట్ , డెబిట్ కార్డులు వంటివి పొందాలంటే ఆధార్ కార్డు అవసరం. అంతేకాక అనేక పనుల విషయంలో ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలి. ఇప్పటికే ఆధార్ కార్డు దాదాపు అందరు పౌరుల వద్ద ఉంది. ఇక ఈ కార్డు అప్ డేట్ విషయంలో కేంద్రం తరచూ ఏదో ఓ కీలక సమాచారం అందిస్తుంది. తాజాగా ఆధార్ కార్డు అప్ డేట్ విషయంలో జరిగే అక్రమాలపై కేంద్రం సీరియస్ అయ్యింది.

దేశంలో ఆధార్‌ కార్డ్‌ అప్‌ డేట్‌ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడే  వారిపై ఉక్కు పాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆధార్ సేవల విషయంలో ఎలాంటి అధిక ఛార్జీలు వసూలు చేయ కూడదు. అలా అధిక ఛార్జీ వసూలు చేస్తున్న ఆపరేటర్లను సస్పెండ్ చేస్తామని కేంద్రం పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టం చేసింది. అంతేకాక అలా అవినీతి పాల్పడే ఆపరేటర్లను నియమించిన యాజమాన్యానికి రూ. 50 వేలు జరిమానా విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

aadhar seva kendram

ఆధార్ సేవల కోసం ఎంతో మంది సంబంధిత కేంద్రాలకు వెళ్తుంటారు. అక్కడ వినియోదారులు తమ ఆధార్ కార్డులో పలు మార్పులు చేసుకుంటారు. బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్  వంటి వివరాల అప్‌డేట్‌తో సహా ఆధార్ సేవలకు అధిక ఛార్జీలు వసూలు చేయకూడదనే సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ఆధార్ ఆపరేటర్లకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశాన్ని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ఫిర్యాదులు అందితే వెంటనే విచారణ చేస్తామని, ఈ నేపథ్యంలో నిజమని తేలితే సంబంధిత నమోదు రిజిస్ట్రార్‌పై రూ. 50 వేలు జరిమానా విధిస్తామని మంత్రి తెలిపారు.

అంతేకాక సదరు ఆపరేటర్‌ను సస్పెండ్ చేస్తామని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఆధార్‌ సంబంధించిన అంశాలపై ఫిర్యాదు చేయాలంటే యూఐడీఏఐ ఈమెయిల్‌ ద్వారా చేయోచ్చని తెలిపారు. అలా కాకుంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1947కి కాల్‌ చేయోచ్చని ఆయన తెలిపారు. మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఆపరేట్లు అక్రమాలకు పాల్పడితే భారీ మూల్యం తప్పదు. ఎవరైనా ఆధార్ సేవలు అందించే ఆపరేట్లు ఒక్క రూపాయి అదనంగా తీసుకున్న భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక్క రూపాయి తీసుకున్నా.. రూ.50,000 వేలు  జరిమాన కట్టాల్సి ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో తెలిపిన ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి