iDreamPost

ఉగాదికి నిజంగా అంత సీనుందా?

ఉగాదికి నిజంగా అంత సీనుందా?

మాములుగా టాలీవుడ్ కు సంక్రాంతికి మించిన కమర్షియల్ సీజన్ మరొకటి లేదు. ఏడాది పొడవునా చాలా పండుగలు ఉన్నాయి కాని రెవిన్యూ పరంగా దేనితోనూ సంక్రాంతికి పోలిక రాదు. తర్వాత కొద్దోగొప్పో సెలవులు ఎక్కువ వస్తాయి కాబట్టి దసరాని చెప్పుకోవచ్చు. దీపావళి కూడా మనకు వర్క్ అవుట్ కాని సీజనే. ఉగాది తెలుగు వారి నూతన సంవత్సరాదే అయినా దాన్ని ఒక్క రోజు మాత్రమే చేసుకుంటారు కాబట్టి సినిమాల పరంగా పెద్దగా వర్కవుట్ అయిన దాఖలాలు తక్కువ. 

కాని ఈ సారి మాత్రం కొంచెం గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోంది. ముందుగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న నాని మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంతో పాటు సుధీర్ బాబు మరో హీరోగా నటించడం వెయిట్ ని పెంచింది. ఇక రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జి కూడా పోటీకి సై అంది. అసలే మార్కెట్ బాగా పడిపోయిన ఈ హీరో ఇంత రిస్క్ చేయడం ఆశ్చర్యమే. దర్శకనిర్మాతలు మాత్రం ధీమాగా ఉన్నారు. బజ్ అయితే దీని విషయంలో అంతగా లేదు. 

ఇవి చాలవు అన్నట్టు తాజాగా యాంకర్ ప్రదీప్ హీరోగా డెబ్యు చేస్తున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కూడా అదే తేదిని కన్ఫర్మ్ చేసుకుంది. నీలి నీలి ఆకాశం పాట ఇప్పటికే చార్ట్ బస్టర్ అయ్యింది. బిజినెస్ పరంగా కూడా ఆఫర్స్ బాగానే వచ్చాయట. మరి నాని, రాజ్ తరుణ్ లను ప్రదీప్ ఎంతవరకు ఫేస్ చేయగలడో చూడాలి. తెలుగువి ఇలా ఉంటే హింది మల్టీ స్టారర్ సుర్యవంశి కూడా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ముఖ్యంగా మల్టీ ప్లెక్సుల్లో దీని డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యురియాస్ లేటెస్ట్ ఎడిషన్ ని తక్కువ అంచనా వేయలేం. ఈ నేపధ్యంలో లాంగ్ వీకెండ్ తో ఊరిస్తున్న ఉగాది ఇన్ని సినిమాలకు ఏ మేరకు ఉపయోగపడనుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి