iDreamPost

సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి.. వైరల్ అవుతున్న చరణ్​ ట్వీట్!

  • Author singhj Published - 03:21 PM, Mon - 4 September 23
  • Author singhj Published - 03:21 PM, Mon - 4 September 23
సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి.. వైరల్ అవుతున్న చరణ్​ ట్వీట్!

ఫిల్మ్ సెలబ్రిటీలకు ఏ రేంజ్​లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ ముఖ్యంగా హీరోలకు భారీ స్థాయిలో అభిమానగణం ఉంటుంది. వాళ్ల కెరీర్​తో పాటు సాధారణ జీవితంలో జరిగే ప్రతి విషయం తెలుసుకోవాలనే కుతూహలం ఫ్యాన్స్​లో ఉండటం మామూలే. అయితే కొన్ని విషయాలు నేరుగా సెలబ్రిటీలు చెప్పడం వల్ల బయటికి వస్తే.. మరికొన్ని పుకార్ల రూపంలో అందరికీ తెలుస్తాయి. అయితే సోషల్ మీడియా వాడకం ఎక్కువైన ఈ కాలంలో ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. అందుకే సెలబ్రిటీలు మరింత జాగ్రత్తగా మసలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా లేకుంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి తాజాగా ఓ కోలీవుడ్ హీరోను ఉదాహరణగా చెప్పొచ్చు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, మంత్రి, కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. సామాజిక న్యాయానికి సనాతన ధర్మం వ్యతిరేకం అని, దీన్ని పూర్తిగా నిర్మూలించాలని ఉదయనిధి చేసిన కామెంట్స్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఉదయనిధిపై పలు చోట్ల కేసులు కూడా పెట్టారు. అయితే తన వ్యాఖ్యలపై ఇంత వ్యతిరేకత వస్తున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇదిలా ఉంటే.. ఉదయనిధి స్టాలిన్​పై తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ చేసిన ఒక పాత ట్వీట్​ను వైరల్ చేస్తున్నారు.

సనాతన ధర్మాన్ని ఉద్దేశించి రామ్ చరణ్​ 2020లో ఒక ట్వీట్ చేశారు. ఇంట్లోని తులసి మొక్కకు తన తల్లి సురేఖ పూజ చేస్తున్న ఫొటోను ట్వీట్ చేసిన చెర్రీ.. ‘మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత’ అని ఆ ట్వీట్​లో రాసుకొచ్చారు. ఆ ట్వీట్​ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. స్టాలిన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న కొందరు చరణ్ ట్వీట్​ను ఇప్పుడు రీట్వీట్ చేస్తున్నారు. కాగా, సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడి ఉన్నానని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. తన మీద ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మళ్లీ చెబుతున్నానని.. తన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి