iDreamPost

బ్రేకింగ్: ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సర్వర్ డౌన్!

ప్రస్తుతం ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అలా వినియోగిస్తున్న వాటిలో ఎక్స్ (ట్విట్టర్) ఒకటి.

ప్రస్తుతం ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అలా వినియోగిస్తున్న వాటిలో ఎక్స్ (ట్విట్టర్) ఒకటి.

బ్రేకింగ్: ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సర్వర్ డౌన్!

ప్రస్తుతం ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యామాలను వినియోగిస్తున్నారు. ఇక ఎక్స్ గా పేరు మార్చుకున్న ట్విట్టర్ కు సైతం  ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నారు. సెలబ్రీటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు ఎక్స్ సేవలను వినియోగించుకుంటున్నారు. దీని ద్వారా ఎంతో మంది తమ సందేశాలను, ఇతర విషయాలను షేర్ చేసుకుంటారు. ఇక ఈ ఎక్స్ క్షణం ఆగిపోయినా ఊహించలేము. అందుకే అది నిత్యం అందుబాటులో ఉండేలా సదరు సంస్థ అప్రమత్తంగా ఉంటుంది. అయితే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్(ట్విట్టర్ ) సర్వర్ డౌన్ అయింది. సాంకేతిక కారణాలతో ఎక్స్ సేవలు నిలిచిపోయాయి. మరి.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో నెటిజన్లు తమ ట్విట్టర్ ఖాతా పనిచేయడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఎందుకు ట్విట్టర్ పనిచేయడం లేదని విషయం మాత్రం ఆ సంస్థ యజమాన్యం ఇంకా వెల్లడించలేదు. సాంకేతిక సమస్యల కారణంగా ట్విట్టర్‌ సర్వర్‌ డౌన్‌ అయ్యింది. పలువురు వినియోగదారులు పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. గత జూలైలో ట్విట్టర్‌ సేవలు నిలిచిపోయిన విషయం విధితమే. గత ఫిబ్రవరిలో రెండుసార్లు ట్విట్టర్‌ సేవలను నిలిచిపోయాయి. అలానే ఇటీవలే ఒక్కసారి కూడా  ట్విట్టర్ సర్వర్ డౌన్ అయిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి