iDreamPost

తుగ్లక్ దర్బార్ రిపోర్ట్

తుగ్లక్ దర్బార్ రిపోర్ట్

సైరా, ఉప్పెనతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న విజయ్ సేతుపతి కొత్త సినిమా తుగ్లక్ దర్బార్ మొన్న శుక్రవారం సన్ టీవీ లో డైరెక్ట్ ప్రీమియర్ తో పాటు నెట్ ఫ్లిక్స్ లోనూ నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ వెరైటీగా ఉండటంతో పాటు రాశిఖన్నా హీరోయిన్ గా నటించడంతో ఇక్కడా అంతో ఇంతో ఆసక్తి రేపడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. కాకపోతే ఆ రోజు మనకు సీటిమార్, తలైవి లాంటి థియేట్రికల్ రిలీజులు ఉండటంతో దీని మీద పెద్ద ఫోకస్ వెళ్ళలేదు కానీ ఆ తర్వాత మెల్లగా మనవాళ్ళ దృష్టి దీని వైపు మళ్లింది. మరి ఉన్నకొద్దిపాటి అంచనాలను అందుకునేలా తుగ్లక్ దర్బార్ ఉందో లేదో రివ్యూలో చూద్దాం.

ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన కామెడీ టైప్ డ్రామా. ఎన్నికల ప్రచార సభలోనే తల్లికి నొప్పులు వచ్చి అక్కడే పుట్టిన సింహాచలం(విజయ్ సేతుపతి)అవే ఆలోచనలతో పెరుగుతాడు. ఎంతగా అంటే తోడబుట్టిన చెల్లి కంటే నాయకుడు రాయప్ప(పార్తీబన్)నే ఎక్కువ అనుకునేంత. లీడర్ అండతో సింహాచలం కార్పొరేటర్ గా గెలుస్తాడు. కానీ ఓ గొడవలో సహచరుడు తల పగలగొట్టడంతో ఇతనిలో స్ప్లిట్ పర్సనాలిటీ మొదలవుతుంది. దీంతో ఒకసారి తప్పుడు పనులు చేస్తే ఇంకోసారి వాటిని దిద్దుకునేందుకు మంచివాడిగా మారుతూ విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది సినిమాలోనే చూడాలి.

పాయింట్ మంచిదే అయినప్పటికీ దర్శకుడు దిల్లీ ప్రసాద్ దీన్ దయాలన్ తీర్చిదిద్దిన తీరు పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయింది. విజయ్ సేతుపతి తన వైవిధ్యమైన నటనతో రెండు షేడ్స్ ని చక్కగా పోషించినా తన ఎనర్జీని పూర్తిగా వాడుకునే విషయం ఇందులో తక్కువ. క్యారెక్టరైజేషన్ లోపాలు మైనస్ గా మారాయి. రాశి ఖన్నాతో లవ్ ట్రాక్ కూడా సోసోనే. అక్కడక్కడా తప్ప తుగ్లక్ దర్బార్ లో బెస్ట్ అనిపించే మూమెంట్స్ లేవు. మరీ తీరికగా ఉండి ఇంకే ఆప్షన్లు లేవనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. కాకపోతే మొన్న థియేటర్లలో విజయ్ సేతుపతి మరో సినిమా లాభం కన్నా వంద రెట్లు నయమనిపించేలా ఉండటం ఒక్కటే ఊరట

Also Read : అంచనాలకు తగ్గట్టే లవ్ స్టోరీ ప్రయాణం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి