iDreamPost

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన TSRTC!

  • Author Soma Sekhar Updated - 10:06 PM, Sat - 2 September 23
  • Author Soma Sekhar Updated - 10:06 PM, Sat - 2 September 23
ఉద్యోగులకు శుభవార్త చెప్పిన TSRTC!

తెలంగాణ ఆర్టీసీ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థ ఎంత నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రయాణికులపై భారం పడకుండా.. అలాగే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే TSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మరో విడత డీఏ ఇవ్వాలని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశాడు. అందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సిన 5% DAను ఉద్యోగులకు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇవ్వాల్సిన 5 శాతం డీఏను సెప్టెంబర్ నెల జీతంతో కలిపి ఉద్యోగులకు చెల్లించనున్నట్లు పేర్కొంది. సంస్థ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాగానీ.. ఇప్పటి వరకు 8 డీఏలను మంజూరు చేశామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. అదీకాక పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి శ్రమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా.. డీఏ పెంపునకు సంబంధించి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్. మరి టీఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి