iDreamPost

ఉచిత ప్రయాణం ఎఫెక్ట్.. TSRTC కీలక నిర్ణయం.. రేపట్నుంచి ఆ టికెట్లు రద్దు

  • Published Dec 31, 2023 | 12:30 PMUpdated Dec 31, 2023 | 12:30 PM

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కారణంగా రద్దీ బాగా పెరిగిది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ.. కీలక నిర్ణయం తీసుకుంది. ఆ టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కారణంగా రద్దీ బాగా పెరిగిది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ.. కీలక నిర్ణయం తీసుకుంది. ఆ టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Dec 31, 2023 | 12:30 PMUpdated Dec 31, 2023 | 12:30 PM
ఉచిత ప్రయాణం ఎఫెక్ట్.. TSRTC కీలక నిర్ణయం.. రేపట్నుంచి ఆ టికెట్లు రద్దు

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలు, బాలికలతో పాటు ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్రవ్యాప్తంగా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డీనరి బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. తెలంగాణ వాసులమని చూపించేలా ఏదైనా గుర్తింపు కార్డు అనగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకుని.. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల నుంచే అనగా.. డిసెంబర్ 9 నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవతుంది. దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి.. బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య బాగా పెరుగింది అని ఆర్టీసీ గణంకాలు వెల్లడించాయి. ఉచిత ప్రయాణం పథకం అమలుకు ముందు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 12 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 30 లక్షల వరకు పెరిగింది అని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Those tickets will be canceled from tomorrow

కొన్ని రూట్లలో బస్సు లోపలికి కాలు పెట్టడానికి కూడా సందు లేనంతగా కిక్కిరిసి పోతున్నారు ప్రయాణికులు. కండక్టర్లు ముందు నుంచి వెనక్కి తిరుగుతూ.. టికెట్లు జారీ చేసేందుకు వెళ్లే పరిస్థితులు కూడా లేవు. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా ఆపేస్తున్నట్లు వెల్లడించింది.

ఫ్యామిలీ 24, టీ -6 ప్రయోజనాలు..

ఫ్యామిలీ 24 టికెట్లు తీసుకుంటే.. కుటుంబంలోని నలుగురు ప్రయాణికులు.. 24 గంటల పాటు సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్‌ బస్సుల్లో నగరలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తాయి. ఈ ఫ్యామిలీ-24 టికెట్‌ ద్వారా ఫ్యామిలీలోని నలుగురు సభ్యులకు కలిపి రూ. 300 చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుత రద్దీ దృష్ట్యా ఆ టికెట్‌ను తొలగిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మహిళలు, సీనియర్‌ సిటిజన్ల సౌకర్యార్థం ప్రత్యేకంగా టీ-6 టికెట్‌ను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ టీ-6 టికెట్ కి రూ. 50 చెల్లించి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో.. 6 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు టీ-6 టికెట్‌ వర్తిస్తుంది. టికెట్‌ తీసుకునే సమయంలో వయసు ధ్రువీకరణ కోసం వారు ఆధార్‌ కార్డు కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత రద్దీ దృష్ట్యా టీ-6 టికెట్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ రెండు టికెట్ల రద్దుతో మహిళలకు ఎలాంటి నష్టం జరగకున్నా.. ఆ టికెట్లు తీసుకొని ప్రయాణించే పురుషులకు మాత్రం షాకింగ్ న్యూసే అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి