iDreamPost

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు!

తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ఖరారు చేసింది TSPSC. ఆ ఎగ్జామ్ ను ఎప్పుడు నిర్వహిస్తారంటే?

తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ఖరారు చేసింది TSPSC. ఆ ఎగ్జామ్ ను ఎప్పుడు నిర్వహిస్తారంటే?

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు!

తెలంగాణలో నిర్వహించనున్న గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ఖరారు చేసింది TSPSC. జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా.. ఇటీవలే 563 పోస్టులకు గాను గ్రూప్-1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది టీఎస్ పీఎస్సీ. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న నిర్వహించనున్నట్లు TSPSC ప్రకటించింది. కాగా మెుత్తం 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 23న దరఖాస్తుల ప్రక్రియ మెుదలు కాగా.. మార్చి 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల కోసం లక్షల సంఖ్యలో నిరుద్యోగులు అప్లై చేసుకున్నారు. అయితే గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసి.. దానికి మరికొన్ని పోస్టులు చేర్చి కొత్త నోటిఫికేషన్ ను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఇదికూడా చదవండి: తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి