iDreamPost

బ్రేకింగ్ న్యూస్: గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు!

TSPSC Group-1: గ్రూప్-1 విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది.

TSPSC Group-1: గ్రూప్-1 విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది.

బ్రేకింగ్ న్యూస్: గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు!

రాష్ట్ర స్థాయిలో కీలక పోస్టులను భర్తీ చేసేందుకు గ్రూప్-1 పరీక్షలు నిర్వహిస్తారు. జాయిట్ కలెక్టర్, డీఎస్ఫీల స్థాయి పోస్టులను భర్తీ చేసేందుకు గ్రూప్-1 ను నిర్వహిస్తుంటారు. అయితే నోటిఫికేషన్ల విడుదల, రద్దు కావడం వంటివి జరుగుతుంటాయి. తెలంగాణ గ్రూప్-1 విషయంలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ గ్రూప్-1 విషయంలో టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. 2022లో 503 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక ఇప్పటికే  రెండు సార్లు  గ్రూప్-1 రద్దైన సంగతి తెలిసిందే. 563 పోస్టులకు త్వరలోనే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ గ్రూప్-1 నోటఫికేషన్ రద్దు అయింది. గత ప్రభుత్వం విడుదల చేసిన పాత నోటిఫికేషన్ ను  టీఎస్ పీఎస్సీ సోమవారం రద్దు చేసింది. ఈమేరకు టీఎస్ పీఎస్సీ ఓ వెబ్ ప్రకటన విడుదల చేసింది. 2022 మార్చి 26వ తేదీన 503  పోస్టులకు గ్రూప్-1 నోటిఫికిషషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పలు సమస్యలపై  కమిషన్  చర్చిందిందని, అన్ని పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకున్నాకే ప్రజా ప్రయోజనాల దృష్టా రద్దు చేయాలని నిర్ణయం చీసుకున్నట్లు టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పేర్కొన్నారు. ఇటీవలే మరో 60 గ్రూప్-1 పోస్టులకు రేవంత్ రెడ్డి సర్కార్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.

గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రజాప్రయోజనాల దృష్ట్యా రద్దు చేసినట్లు టీఎస్ పీఎస్సీ బోర్డు  ప్రకటించింది. పూర్తి స్థాయి విచారణ  తరువాత మళ్లీ నిర్ణయం తీసుకుంటామని కమిషన్ వెల్లడించింది. ఇక.. రెండేళ్ల క్రితం తొలిసారి నిర్వహించిన గ్రూప్-1 పేపర్ లీక్ కావడంతో  ఆ పరీక్షను రద్దు చేశారు. రెండో సారి నిర్వహించిన పరీక్షల్లో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు మరోసారి గ్రూప్-1 పరీక్షను రద్దు చేసింది. మరి.. ఇలా వరుసగా తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్, పరీక్షలు రద్దు అవుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి