iDreamPost

ఎవరిది పైచేయి.. నేడు తెలంగాణ పుర ఫలితాలు..

ఎవరిది పైచేయి.. నేడు తెలంగాణ పుర ఫలితాలు..

తెలంగాణ పట్టణాలలో రాజకీయ పార్టీల భవితవ్యం నేడు తెలనుంది. ఈ నెల 22 జరిగిన పురపాలక, నగరపాలక ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లుకు ఎన్నికలు నోటిఫికేషన్‌ విడుదల చేయగా ఈ నెల 22న కరీంనగర్‌ నగరపాలక సంస్థకు మినహా మిగతా పురపాలక, నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. నిన్న శుక్రవారం కరీంనగర్‌లో ఓటింగ్‌ జరిగింది.

ఈ రోజు ఉదయం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు సంబంధించిన ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది. వార్డులు, డివిజన్ల వారీగా ఫలితాలు వెల్లడికానుండడంతో లెక్కింపు మొదలైన గంట నుంచే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ నెల 27వ తేదీన చైర్మన్, మేయర్‌ ఎన్నిక జరగనుంది. కౌన్సిలర్‌లు, కార్పొరేటర్లు చేతులు ఎత్తి మద్దతు తెలిపే ప్రక్రియ ద్వారా చైర్మన్, మేయర్లను ఎన్నుకోనున్నారు.

Read Also: అసెంబ్లీకి ముందే మంత్రివర్గ సమావేశం.. మండలి రద్దు ఖాయమేనా..?

పుర ఫలితాలు తమకే అనుకూలమని అధికార టీఆర్‌ఎస్‌ ధీమాగా ఉంది. కాంగ్రెస్‌ కూడా సత్తా చాటుతామనే భావనతో ఉంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం తామేనన్న సంకేతాలు ఇచ్చేందుకు బీజేపీ ఈ ఎన్నికలను అవకాశంగా తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరిది పైచేయి అవుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సాయంత్రానికే పార్టీల భవిష్యత్‌ తేలనుంది.

కాగా, గెలిచిన తర్వాత కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేజారకుండా ఉండేలా.. కాంగ్రెస్‌ పార్టీ వారి నుంచి అగ్రిమెంట్‌ తీసుకుంది. ఇది ఏ మేరకు పని చేస్తుందో ఈ నెల 27న జరిగినే చైర్మన్, మేయర్‌ ఎన్నికల రోజును తేలనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి