iDreamPost

బ్రేకింగ్‌: శుక్రవారం కూడా విద్యాసంస్థలకు సెలవు.. ప్రకటించిన సర్కార్‌

  • Published Jul 27, 2023 | 1:06 PMUpdated Jul 27, 2023 | 1:06 PM
  • Published Jul 27, 2023 | 1:06 PMUpdated Jul 27, 2023 | 1:06 PM
బ్రేకింగ్‌: శుక్రవారం కూడా విద్యాసంస్థలకు సెలవు.. ప్రకటించిన సర్కార్‌

గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ నంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం రాత్రి నుంచి నగరంలో ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రెండు రోజుల పాటు అనగా.. బుధ, గురువారం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్‌ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా  మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం విద్యా సంస్థలకు మరో రోజు సెలవు ప్రకటించింది.

శుక్రవారం(జూలై 28) న కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నింటికి సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ సీఎం కేసీఆర్‌.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. శనివారం మొహర్రం సెలవు కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నీ సోమవారం తెరుచుకోనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి