iDreamPost

అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోనున్న TDP.. సోషల్‌ మీడియాలో ప్రచారం

  • Published Oct 25, 2023 | 11:16 AMUpdated Oct 25, 2023 | 11:46 AM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. పార్టీలన్ని ఎలక్షన్ల కోసం రెడీ అవుతుండగా.. టీడీపీ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్‌ లేదు. దాంతో టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. పార్టీలన్ని ఎలక్షన్ల కోసం రెడీ అవుతుండగా.. టీడీపీ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్‌ లేదు. దాంతో టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

  • Published Oct 25, 2023 | 11:16 AMUpdated Oct 25, 2023 | 11:46 AM
అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోనున్న TDP.. సోషల్‌ మీడియాలో ప్రచారం

తెలంగాణలో ఎన్నికల పోరు ప్రారంభమైంది. ప్రధాన పార్టీలతో పాటు.. స్వతంత్రులు, చిన్నాచితకా పార్టీలు అన్ని కూడా ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో పాటు ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాయి. ప్రస్తుతం తెలంగాణలో పార్టీలన్ని.. ఎన్నికల పోరు కోసం రెడీ అవుతుండగా.. తెలుగుదేశ పార్టీ మాత్రం.. ఇంకా తన కార్యచరణ ప్రకటించలేదు. 80కిపైగా స్థానాల్లో పోటీ చేస్తామంటూ.. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటన లేదు.. మేనిఫెస్టో కూడా విడుదల చేయలేదు.

దాంతో.. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అంతేకాక తెలంగాణ ఎన్నిలక బరి నుంచి తప్పుకున్న టీడీపీ అంటూ సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం సాగుతోంది. మొన్నటి వరకు టీడీపీ పోటీ చేస్తుంది అని భావిస్తుండగా.. ఉన్నట్లుండి హఠాత్తుగా మంగళవారం ఉదయం నుంచి మాత్రం కొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది.

కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుందన్న ప్రచారం సాగుతుంది. 80కి పైగా స్థానాల్లో పోటీ చేస్తామని టీడీపీ ప్రకటించింది. కానీ ప్రస్తుతం ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు కూడా దొరకడం లేదని.. అందుకే ఆ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుందనే ప్రచారం సాగుతోంది.

అదంతా తప్పుడు ప్రచారం: కాసాని

అయితే ఈ ప్రచారంపై టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెంటనే స్పందించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని ఖండించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని మాత్రం ఆయన చెప్పలేకపోయారు. ఇదిలా ఉండగా.. ఇక నేడు అనగా బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో.. కాసాని జ్ఞానేశ్వర్‌ ములాఖత్ అవ్వనున్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో.. టీడీపీ , బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని కొన్ని రోజుల పాటు ప్రచారం సాగగా.. ప్రస్తుతం మాత్రం టీడీపీ పోటీ నుంచి వైదొలుగుతుందని మరో ప్రచారం తెర మీదకు వచ్చింది. దీనికి తగ్గట్టుగానే.. ఇప్పటి వరకు టీడీపీ ఎన్నికలకు సన్నాహాలు లేకపోవడంతో.. ఈ ప్రచారం నిజమనే అనుకుంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.

బాబుతో ములాఖత్‌ తర్వాత ప్రకటన

తెలంగాణలో ఎన్నికల నగరా మోగడం.. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో.. తెలంగాణ టీడీపీకి తానున్నానని.. రాష్ట్రం అంతా తిరిగి తానే ప్రచారం చేస్తానని బాలకృష్ణ ప్రకటించారు. ఆ తర్వాత బాలయ్య మళ్లీ దీనిపై స్పందించలేదు. చంద్రబాబు గతంలో ఓ సారి కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అవ్వడం.. ఆ తర్వాత కాసాని 75 మంది అభ్యర్థుల జాబితాను రెడీ చేసుకుని.. ఎన్నికల బరిలో దిగడానికి రెడీ అయ్యారు. అయితే చంద్రబాబు నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు. దాంతో కాసాని కూడా సైలెంట్‌ అయ్యారు.

ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదనే ప్రచారం తెర మీదకు వచ్చింది. అయితే టీడీపీ పోటీ చేయకపోతేనే మంచిదన్న వాదనను కొంత మంది వినిపిస్తున్నారు. బాబుతో ములాఖత్‌ తర్వాత దీనిపై క్లారిటీ రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి