iDreamPost

కాంగ్రెస్ మేనిఫెస్టో: అమ్మాయి పెళ్లికి రూ.లక్ష, తులం బంగారం.. స్టూడెంట్స్‌కి స్కూటీ

  • Published Nov 17, 2023 | 4:11 PMUpdated Nov 17, 2023 | 4:11 PM

తెలంగాణ ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్‌ పార్టీ బలంగా ప్రయత్నిస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఇప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటించగా.. తాజాగా మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ వివరాలు..

తెలంగాణ ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్‌ పార్టీ బలంగా ప్రయత్నిస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఇప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటించగా.. తాజాగా మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ వివరాలు..

  • Published Nov 17, 2023 | 4:11 PMUpdated Nov 17, 2023 | 4:11 PM
కాంగ్రెస్ మేనిఫెస్టో: అమ్మాయి పెళ్లికి రూ.లక్ష, తులం బంగారం.. స్టూడెంట్స్‌కి స్కూటీ

తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటించడమే కాక.. వాటిని మీడియా, సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసి ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. తాజాగా ఎన్నికలకు సంబంధించి తన పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనిలో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. మొత్తంగా 66 ప్రధాన హామీలతో 42 పేజీల మేనిఫెస్టోని విడుదల చేసింది కాంగ్రెస్‌ పార్టీ.

కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. శుక్రవారం నాడు.. గాంధీ భవన్‌లో మేనిఫెస్టోను విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా పీపుల్స్‌ మేనిఫెస్టోని రూపొందించినట్లు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ మేనిఫెస్టో.. కాంగ్రెస్‌ పార్టీకి భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లా పవిత్రమైందని తెలిపారు. రాష్ట్ర సంపదను పెంచి.. పేదలకు పంచేలా మేనిఫెస్టో రూపించిందినట్లు తెలిపారు.

ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలోని ప్రతీ హామీని అమలు చేస్తామని తెలిపారు. మహిళలను ఆకట్టుకోవడం కోసం కర్ణాటక తరహాలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పేర్కొంది. అలానే కళ్యాణమస్తు పథకంలో భాగంగా అమ్మాయి పెళ్లికి రూ. లక్ష, తులం బంగారం కానుకగా ఇస్తామని చెప్పుకొచ్చింది. 18 ఏళ్లు నిండిన, చదువుకునే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఉచితంగా అందజేస్తామని తెలిపింది. అలానే అంగన్వాడీ టీచర్ల జీతాలను 18 వేలకు పెంచుతామని చెప్పుకొచ్చింది. బెల్టు షాపులను పూర్తిగా రద్దు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పుకొచ్చింది.

2 లక్షల ఉద్యోగాలు భర్తీ..

తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు విడతల్లో 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పేర్కొంది. పైగా ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్‌ జారీ చేస్తారనే అంశాన్ని కూడా చెప్పుకొచ్చింది. వచ్చే ఏడాది అనగా 2024, ఫిబ్రవరి 1న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌, ఏప్రిల్‌ 1న గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వెల్లడించింది. అలానే జూన్‌ 1న గ్రూప్‌-3, గ్రూప్‌-4 జాబ్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించింది. అలానే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 25 వేల రూపాయల పెన్షన్‌, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి