iDreamPost

Barrelakka in Kolhapur: పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు.. కొల్లాపూర్ లో బర్రెలక్క ముందంజ

  • Published Dec 03, 2023 | 9:59 AMUpdated Dec 04, 2023 | 8:52 AM

Barrelakka Election Results in Kollapur | Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ వివరాలు..

తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొత్తం 119 నియోజకవర్గాలలో లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ముందుగా పోస్టల్ ఓట్లు, సర్వీస్ ఓట్లు లెక్కిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు తగ్గట్టుగానే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడుతున్నాయి. చాలా చోట్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ముందజలో ఉండగా.. కొల్లాపూర్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో నిరుద్యోగ అభ్యర్థుల తరుపు నుంచి నిలబడిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష  తొలిరౌండ్ లో 473 ఓట్లు కౌంట్ తో ముందంజలో కొనసాగింది. రెండో రౌండ్ లో 262 ఓట్లు పోలయ్యాయి.  అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ముందు కొనసాగుతూ వచ్చారు.. చివరికి కొల్లాపూర్ లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది.

ఇక  విజిల్ గుర్తుతో బరిలోకి దిగిన బర్రెలక్కకు మొత్తం 5658 ఓట్లు వచ్చాయి. పోటీలో నిల్చున్న బర్రెలక్క మాట్లాడుతూ.. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని.. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని తెలిపింది. తన గ్రామ సమస్యలపై కూడా ప్రభుత్వంతో పోరాడుతా అన్నారు.  తొలిసారి పోటీ చేసి అన్ని ఓట్లు సాధించిన బర్రెలక్క సాధారణ వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అందరికీ స్పూర్తిగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నాన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి