iDreamPost

ప్రారంభమైన కౌంటింగ్.. ఆసక్తికర ట్వీట్ చేసిన KTR

  • Published Dec 03, 2023 | 9:42 AMUpdated Dec 03, 2023 | 9:42 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. కౌంటింగ్ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. కౌంటింగ్ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ వివరాలు..

  • Published Dec 03, 2023 | 9:42 AMUpdated Dec 03, 2023 | 9:42 AM
ప్రారంభమైన కౌంటింగ్.. ఆసక్తికర ట్వీట్ చేసిన KTR

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది.. అధికారంలోకి వచ్చేది ఎవరో మరి కాసేపట్లో తేలిపోనుంది. ఈ సారి ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్ని తీవ్రంగా శ్రమించాయి. ఒకదానితో ఒకటి పోటీ పడుతూ.. ప్రజాకర్షక హామీలతో మేనిఫెస్టోలు విడుదల చేసి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాయి. కారు పార్టీ హ్యాట్రిక్ పక్కా అనే ధీమాతో ఉండగా.. మార్పు కావాలంటే.. కాంగ్రెస్ రావాలి అంటూ హస్తం పార్టీ ప్రచారంలో దూసుకుపోయింది. ఇక బీజేపీ బీసీ సీఎం క్యాండెట్ అంటూ ప్రచారం చేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికార పార్టీకి భారీ షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్ని.. కాంగ్రెస్ దే అధికారం అని వెల్లడించాయి. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం మరోసారి అధికారంలోకి వచ్చేది తామే అంటున్నారు. ఇక కౌంటింగ్ నేథ్యంలో కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. హ్యాట్రిక్ లోడింగ్ 3.0.. సంబురాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. ఈమేరకు ట్వీట్ చేశారు. కౌంటింగ్ ప్రారంభానికి కొన్నగంటల ముందు హ్యాట్రిక్ లోడింగ్ అంటూ తుపాకీతో గురిపెట్టిన ఫొటోను షేర్ చేయటం ఆసక్తికరంగా మారింది.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత కూడా.. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కచ్చితంగా తమ పార్టీదే అధికారమని చెప్పటం గమనార్హం. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పని నిరూపించామని.. ఈసారి కూడా అదే జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలెవ్వరూ ఎగ్జిట్ పోల్స్ చూసి నిరుత్సాహ పడకూడదని.. వచ్చేది సారు సర్కారేనని ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. లోకమంతా కాంగ్రెస్ పార్టీదే అధికారం అంటుంటే.. కేసీఆర్, కేటీఆర్ మాత్రం మనదే సర్కార్ అని ఏ ధీమాతో చెప్తున్నారన్నది శ్రేణులు చర్చించుకుంటున్నారు. మరి వీళ్ల గురి నిజమవుతుందా.. లేక తప్పుతుందా అన్నది మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి