iDreamPost

సొంత గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. రాహుల్‌ సమక్షంలో చేరిక?

  • Published Oct 23, 2023 | 11:36 AMUpdated Oct 23, 2023 | 11:36 AM

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసంతృప్తులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసంతృప్తులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

  • Published Oct 23, 2023 | 11:36 AMUpdated Oct 23, 2023 | 11:36 AM
సొంత గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. రాహుల్‌ సమక్షంలో చేరిక?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే పార్టీలన్ని అభ్యర్థుల ప్రకటన, ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత అన్నీ పార్టీల్లో అసంతృప్త నేతలు.. ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర వార్త హాల్‌చల్‌ చేస్తోంది. అది ఏంటి అంటే.. కాంగ్రెస్‌ పార్టీ మీద అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు రెడీ అయ్యారనే వార్త వినిపిస్తోంది. దీని గురించి ఆయన తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో మంతనాలు చేస్తున్నారట. రాహుల్‌ గాంధీ సమక్షంలో.. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారనే టాక్‌ వినిపిస్తోంది. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

ప్రస్తుతం వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. రాజగోపాల్‌ రెడ్డి ఈనెల 27న బీజేపీకి గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్‌ పార్టలో చేరడానికి ముహుర్తం కూడా ఫిక్సైనట్లు టాక్ వినిపిస్తోంది. ఇక రాజగోపాల్‌ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరితే.. ఆ పార్టీకి మరింత కలిసి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కి మంచి పట్టు ఉంది. కానీ అనూహ్య రీతిలో రాజగోపాల్‌ రెడ్డి.. పార్టీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరారు.

ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కమలం పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ విజయం సాధించలేదు. బీజేపీలో చేరిన కొన్నాళ్ల నుంచి ఆయన పార్టీపై రాష్ట్ర, కేంద్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. పైగా ప్రస్తుతం తెలంగాణలో బీజేపీక పట్టు తగ్గడం.. కాంగ్రెకస్‌ పుంజుకోవడంతో.. ఆయన పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

లిస్ట్‌లో పేరు లేదు..

అయితే రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన దాన్ని ఖండిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆ వార్తలపై స్పందించడం లేదు. దీనికి తోడు ఆదివారం బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో రాజగోపాల్‌ రెడ్డి పేరు లేదు. దాంతో ఆయన పార్టీ మారడం పక్కా అనే టాక్‌ వినిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి మునుగోడు నుంచే బరిలోకి దిగాలని ఆయన ఆలోచిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది అంటున్నారు.

గతేడాది కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచారు. 2022 నవంబర్‌లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో.. రాజగోపాల్‌రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలోనే కొనసాగినా.. చాలా రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలం పుంజుకోవడంతో.. మళ్లీ ఆయన సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి