iDreamPost

ఈ టాప్-10 లెజెండరీ క్రికెటర్లు వరల్డ్ కప్ ముద్దాడలేదని మీకు తెలుసా?

  • Author Soma Sekhar Published - 12:05 PM, Fri - 7 July 23
  • Author Soma Sekhar Published - 12:05 PM, Fri - 7 July 23
ఈ టాప్-10 లెజెండరీ క్రికెటర్లు వరల్డ్ కప్ ముద్దాడలేదని మీకు తెలుసా?

ఏ క్రికెటర్ కైనా అంతిమ లక్ష్యం.. వరల్డ్ కప్ ను ముద్దాడటమే. తమ సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో ఒక్కసారైనా వరల్డ్ కప్ ను చేతుల్లోకి తీసుకుని ముద్దాడాలన్న కోరిక ఉంటుంది. అయితే ప్రపంచలో ఎందరో దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. కానీ వారందరు వరల్డ్ కప్ ను గెలుచుకోలేకపోయారు. అందులో టీమిండియా దిగ్గజాలతో పాటుగా వివిధ దేశాల ఆటగాళ్లు సైతం ఉన్నారు. మరి వరల్డ్ కప్ 2023 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వరల్డ్ కప్ సాధించని టాప్-10 లెజండరీ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది లెజెండరీ క్రికెటర్లు ఉన్నారు. వీరందరు వరల్డ్ క్రికెట్ పై తమదైన ముద్రవేశారు గానీ.. తమ చిరకాల స్వప్నం అయిన వరల్డ్ కప్ ను మాత్రం సాధించలేకపోయారు. మరి తమ సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో వరల్డ్ కప్ ను ముట్టుకోలేకపోయిన ఆ పది మంది దిగ్గజాలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

సౌతాఫ్రికా క్రికెట్ జట్టును పటిష్టంగా తీర్చిదిద్దిన లెజెండరీ కెప్టెన్లలో గ్రేమ్ స్మిత్ ఒకడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే ప్రోటీస్ జట్టుకు సారథిగా ఎన్నికై రికార్డు నెలకొల్పిన స్మిత్.. తన కెరీర్ లో మాత్రం టీమ్ కు వరల్డ్ కప్ ను అందించలేకపోయాడు. 2007 వరల్డ్ కప్ లో జట్టును తన సారథ్యంలో సెమీఫైనల్ వరకు చేర్చాడు. కానీ ట్రోఫీని మాత్రం అందించలేకపోయాడు. ఇక వరల్డ్ కప్ ను ముట్టుకోకుండా కెరీర్ ముగించిన దిగ్గజాల్లో టీమిండియా నుంచి కూడా ఇద్దరు ఉన్నారు. వారిలో సౌరవ్ గంగూలీ ఒకడు. దాదా కెప్టెన్సీలో వరల్డ్ కప్ ను అందుకునే ఛాన్స్ కొద్దిలో మిస్ అయ్యిందనే చెప్పాలి.

2003 వరల్డ్ లో టీమిండియా ఆడిన తీరు క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. ఈ టోర్నీ ఫైనల్లో టీమిండియా, ఆసీస్ చేతిలో ఓడిపోయిన విధానం టీమిండియా ఫ్యాన్స్ ను ఇప్పటికీ బాధిస్తుంది. ఈ పోరులో విజయానికి చేరువగా వచ్చి భారత జట్టు ఓటమిపాలైంది. కాగా.. తన కెరీర్ లో మూడు వరల్డ్ కప్ లు ఆడిన గంగూలీ.. ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయాడు. ఇక మరో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కూడా వరల్డ్ కప్ ను ముద్దాడలేదు. ప్రపంచ క్రికెట్ లో మిస్టర్ వాల్ గా తనకంటూ ఓ చరిత్రను లిఖించాడు. ఇంతటి ఘనత సాధించిన ద్రవిడ్.. 2003 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు. అదీకాక ఈ ప్రపంచ కప్ లో టీమిండియా ఫైనల్ చేరడంలో రాహుల్ ద్రవిడ్ కీలకపాత్ర పోషించాడు. అయితే తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో ఒక్కసారి కూడా వరల్డ్ కప్ ను అందుకోలేకపోయాడు.

వీరితో పాటుగా న్యూజిలాండ్ డాషింగ్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా, జాక్వెస్ కలిస్, ఏబీ డివిలియర్స్, షాన్ పోలాక్, అనిల్ కుంబ్లే, వకార్ యూనిస్ లాంటి దిగ్గజాలు కూడా ఉన్నారు. వీరందరిలోకెల్లా కుంబ్లే దురదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే కెరీర్ లో నాలుగు వరల్డ్ కప్ లు ఆడిన కుంబ్లే.. ఒక్కటంటే ఒక్క వరల్డ్ కప్ కూడా అందుకోలేకపోయాడు. వీరితోపాటుగా మరికొంతమంది దిగ్గజాలు కూడా వరల్డ్ కప్ ను ముద్దాడడంలో విఫలం అయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి