iDreamPost

TS: చిన్నతప్పుకు సాఫ్ట్ వేర్ జీవితం బలి!

  • Published Feb 20, 2024 | 11:38 AMUpdated Feb 20, 2024 | 11:38 AM

ఈ మధ్యకాలంలో వాహనాదారులు అతివేగంగా ప్రయాణించడం వలన ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఆర్టీసీ బస్సును ఓవర్ ట్రేక్ చేస్తుండంతో ఏం జరిగిందంటే..

ఈ మధ్యకాలంలో వాహనాదారులు అతివేగంగా ప్రయాణించడం వలన ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఆర్టీసీ బస్సును ఓవర్ ట్రేక్ చేస్తుండంతో ఏం జరిగిందంటే..

  • Published Feb 20, 2024 | 11:38 AMUpdated Feb 20, 2024 | 11:38 AM
TS: చిన్నతప్పుకు సాఫ్ట్ వేర్ జీవితం బలి!

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో తీవ్ర గాయాలయిన వారి సంఖ్య కంటే మరణించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా అతివేగంగా ప్రయాణించడం, మధ్యం తాగి వాహనాన్ని నడపడం వంటి సంఘటనలే ఎక్కువ ప్రమాదాలకు దారితీస్తుంది. దీనితో పాటు వేగంగా వెళ్లాలన్న ఆతృతతో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే చాలామంది ఆర్టీసీ బస్సులను ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదానికి గురయ్యి మరణిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఆర్టీసీ బస్సును ఓవర్ ట్రేక్ చేస్తుండంతో ప్రమాదానికి గురయ్యాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీనర్ ఆర్టీసీ బస్సును ఓవర్ ట్రేక్ చేయడంతో బైక్ అదుపు తప్పి ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. విజయవాడ, ఆటోనగర్ కు చెందిన ఆకుల సాయికృష్ణ (26) గచ్చిబౌలివెళ్లలన్న జనార్దన్ హిల్స్ లోని సునీతా రెడ్డి లగ్జరీ మెన్స్ హాస్టల్ లో ఉంటున్నాడు. కాగా, ఇతను గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం సాయికృష్ణ అతని బైక్ పై డీఎల్ఎఫ్ వైపు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే.. రాయదుర్గం నుంచి డీఎల్ఎఫ్ వైపు వస్తున్న హెచ్ సీయూ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే నేపథ్యంలో బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు.

దీంతో ఒక్కసారిగా బస్సు వెనుక చక్రాలు అతడి తలమీదుగా వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇక ఆ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేసుకున్నారు. అయితే ఇలా వేగంగా వెళ్లాలనే తపనతో చాలామంది ఆర్టీసీ బస్సులను ఓవర్ టేక్ చేయడం సరికాదని.. ఇలా చేయడం వలన ప్రమాదానికి గురవుతరని పోలీసులు ఎంత సూచిస్తున్నా వాహనాదారులు మాత్రం ఈ విషయం పై నిర్లక్ష్యంగా పెడచెవిన పెడుతున్నారు. మరి, ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసి మృతి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి