iDreamPost

ఏపీలో దారుణం.. రూ. 500 కోసం భార్యాభర్తలు ఆత్మహత్య!

ఇటీవల మనుషుల మధ్య వచ్చే చిన్న చిన్న వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారి బలవన్మరణాలకు కారణాలు అవుతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు పచ్చచి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.

ఇటీవల మనుషుల మధ్య వచ్చే చిన్న చిన్న వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారి బలవన్మరణాలకు కారణాలు అవుతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు పచ్చచి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.

ఏపీలో దారుణం.. రూ. 500 కోసం భార్యాభర్తలు ఆత్మహత్య!

ఈ మద్య కాలంలో చాలా మంది చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎదుటి వారిపై దాడులు చేయడం.. ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం లాంటివి చేస్తున్నారు. ఆర్థిక సమస్యలు, అక్రమ సంబంధాలు, పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కారణాల వల్ల బలవన్మరణాల పాల్పపడుతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్లు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. భార్యాభర్తలు ఒక చిన్న విషయంలో గొడవ పడి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులను కాపాడుకోవడానికి కుమారుడు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కృష్ణా జిల్లాలోని గుడివాడలో తీవ్ర విషాదం జరిగింది. రూ.500 రూపాల కోసం భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. చిలికి చిలికి గాలివానగా మారి క్షణికావేశంలో భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పపడ్డారు. గుడివాడకు చెందిన రాంబాబు, కనకదుర్గ దంపతులు. వీరి మధ్య రూ.500 రూపాయల విషయంలో గొవడ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన రాంబాబు ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరివేసుకున్నాడు. ఇది గమనించిన కనకదుర్గ వెంటనే తన కొడుకుకు ఫోన్ చేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పపడిన విషయం గురించి చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన కుమారుడు తన తండ్రిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే రాంబాబు కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.

తండ్రి చనిపోయిన విషయం గురించి తల్లికి ఫోన్ చేసి చెప్పాడు కుమారుడు. భర్త మరణవార్త విని ఒక్కసారే కుప్పకూలిపోయింది కనకదుర్గ. భర్త మరణం తట్టుకోలేక మనస్థాపానికి గురైన కనకదుర్గ ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుంది. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన కుమారుడు తన తల్లి ఫ్యాన్ కి ఉరివేసుకోవడం చూసి షాక్ అయ్యాడు. వెంటనే తన తల్లిని హాస్పిటల్ కి తరలించారు.. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కనకదుర్గ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. గంటల వ్యధిలో తల్లిదండ్రులను కోల్పోయిన కుమారుడి ఆవేదన చూసి స్థానికులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. చిన్న గొడవ కారణంగా క్షణికావేశంలో భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దంపతుల మరణానికి గల కారణాలను పోలీసులు విచారించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి