iDreamPost

పానీ పూరి తిని.. 19 మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత! ఓ బాలుడు మృతి!

6 Years Old Boy Died After Eating Pani Puri: రోడ్ సైడ్ లభించే స్ట్రీట్ ఫుడ్ తిని కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురైతున్నారు. శుచీ శుభ్రత పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నా.. వ్యాపారులు నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

6 Years Old Boy Died After Eating Pani Puri: రోడ్ సైడ్ లభించే స్ట్రీట్ ఫుడ్ తిని కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురైతున్నారు. శుచీ శుభ్రత పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నా.. వ్యాపారులు నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

పానీ పూరి తిని.. 19 మంది  చిన్నారులకు తీవ్ర అస్వస్థత! ఓ బాలుడు మృతి!

ఈ మధ్య మృత్యువు ఏ రూపంలో ముంచుకు వస్తుందో ఎవరికీ తెలియదు. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, కరెంట్ షాక్ ఇలా ఎన్నో రకాలుగా చనిపోతున్నారు. కొంతమంది తినడం.. తాగడం వల్ల కూడా చనిపోతున్నారు. ఇటీవల మధ్య కొంతమంది స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల లేని పోని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. రోడ్ సైడ్ లభించే కలుషిత ఆహారం తిని వాంతులు, విరోచనాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. కొంతమంది ఆరోగ్యం పూర్తిగా క్షీణించి కన్నుమూస్తున్నారు. సుచీ శుభ్రత పాటించాలని అధికారులుకు చెబుతున్నప్పటికీ వ్యాపారలు మాత్రం తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. పానీ పూరి తిని ఓ ఆరేళ్ల బాలుడు కన్నుమూశాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

చాలా మంది స్ట్రీట్ ఫుడ్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. రోడ్ సైడ్ దొరికే స్ట్రీట్ ఫుడ్ బజ్జీలు, గారెల్, పావ్ బాజీ, పానీ పూరి అంటే ఇష్టంతో ఆరగిస్తుంటారు. ఇందులో పానీ పూరీ అంటే మరీ ఎక్కువ. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఎంతో ఇష్టపడుతుంటారు. రోడ్ సైడ్ తమ వాహనాలు ఆపి మరీ పానీపూరి తింటుంటారు. అయితే ఇటీవల పానీ పూరి తిని చనిపోయిన సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మలెబెన్నూరు కు చెందిన ఇర్ఫాన్ (6) పానీ పూరి తిని కన్నుమూశాడు. ఇర్ఫాన్ కి సరైన సమయానికి చికిత్స అందక దావణగెరెలోని బాపూజీ ఆస్పత్రిలో కన్నుమూశాడు.

Boy died by eating pani puri

మార్చి 15న జిల్లా హరిహర్ తాలూకాలోని మలేబెన్నూర్ లో కొంతమంది పిల్లలు పానీ పూరి తిన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో 19 మంది పిల్లలు ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలోనే ఇర్ఫాన్ అనే ఆరేళ్ల బాలుడు కన్నమూశాడు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ముగ్గురు కోలుకున్నారు. ఈ ఘటన అనంతరం పానీ పూరి షాపు యజమాని పరారయ్యాడు. ఈ ఘటన మలేబెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అప్పటి వరకు తమతో ఎంతో సంతోషంగా ఉన్న తమ కుమారుడు కానరాని లోకానికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి