iDreamPost

ఆరుగురి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెల్లడి..!

డబ్బు కోసం ఎదుటి వారిని మాయమాటలతో మోసం చేస్తున్నారు.. కొన్ని సార్లు హత్యలకు కూడా చేస్తూ పోలీసులకు దోరికిపోతున్నారు.

డబ్బు కోసం ఎదుటి వారిని మాయమాటలతో మోసం చేస్తున్నారు.. కొన్ని సార్లు హత్యలకు కూడా చేస్తూ పోలీసులకు దోరికిపోతున్నారు.

ఆరుగురి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెల్లడి..!

ఈ మద్య ఈజీ మనీ కోసం ఎలాంటి దారుణాలకైనా పాల్పపడుతున్నారు.  డబ్బు కోసం స్నేహితులు, సొంతవాళ్లను సైతం కడతేర్చడానికి సిద్దమవుతున్నారు. ఎంతో నమ్మకంగా ఉంటూ గొంతు కోస్తున్నారు. స్నేహితుడు అని నమ్మినందుకు స్నేహం ముసుగులో ఆరుగురి ప్రాణాలు తీశాడు ఓ దుర్మార్గుడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరు హత్య కేసుల్లో విస్తుపోయే నిజాలను బయట పెట్టారు పోలీసులు. ఆరుగురి హత్యకు కారణం అయిన నింధితుడు ప్రశాంత్ ని కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ హత్యలు ఎందుకు చేశాడు.. ఎలా చేశారు అన్న విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ యువతి హత్య కేసును ఛేదించే క్రమంలో తీగ లాగితే డొంక కదిలినట్టుగా యువతి సహా మొత్తం ఐదు హత్యలు వెలుగు లోకి వచ్చాయి. మరో విషాదం ఏంటంటే వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. అప్పు తీర్చాలని ఒత్తిడి చేసినందుకు కుటుంబ సభ్యులను మొత్తం నమ్మించి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. వరుస హత్యల గురించి మీడియాతో ఎస్పీ సింధూ శర్మ మాట్లాడుతూ.. ‘ఆరు హత్యలకు ఆర్థిక లావాదేవీలే కారణం, గతంలో తీసుకున్న అప్పును చెల్లించలేక ప్రసాద్ అనే వ్యక్తిని నమ్మించి తన ఆస్తులను సైతం కాజేసేందుకు హంతకుడు ప్రశాంత్ కుట్రలు పన్నాడు. ఆస్తి తాలూకు కుటుంబ సభ్యులను ఎవరినీ లేకండా చేస్తే తాను ఆ ఆస్తి అనుభవించవొచ్చన్న దారుణమైన ఆలోచనతో ప్రశాంత్ కుటుంబలోని చిన్న పిల్లలతో సహా అందారినీ చంపేశాడు. ఈ హత్యలకు కారకుడైన ప్రధాన నింధితుడు ప్రశాంత్ (25) అతనికి సహకరించిన వారిలో మైనర్ బాలుడు సహా బానోతు విష్ణు, బానోతు వంశీలను అరెస్టు చేశాం’ అన్నారు.

ప్రసాద్ – ప్రశాంత్ మంచి స్నేహితులు.2018 లో ప్రసాద్ ఓ యువతి హత్య కేసులో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దీంతో అతన్ని గ్రామస్థులు బహిష్కరించారు. తర్వాత ప్రసాద్ దుబాయ్ వెళ్లిపోయాడు. తన కేసు ఎంత వరకు వచ్చిందనే విషయం గురించి ప్రశాంత్ తో వాకబు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే పలు దఫాలుగా రూ.3.50లక్షలు అప్పు ఇచ్చాడు. 2022లో ప్రసాద్ ఇండియాకు రాగానే మక్లూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. తన కుటుంబాన్ని కామారెడ్డి జిల్లా పాల్వంచకు మార్చాడు. ప్రసాద్ తో పాటు అతని తల్లి సుశీల, భార్య శాన్విక, కవల పిల్లలు చైత్రిక, చైత్రిక్, చెల్లెళ్లు స్వప్న, శ్రావణి కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే ప్రసాద్ కి అప్పులు బాగా పెరిగిపోవడంతో తన ఇల్లును అమ్మాలని చూశాడు. ఇందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో స్నేహితుడు ప్రశాంత్ ని సంప్రదించాడు. ఆస్తి తనపేరు పై రిజిస్ట్రేషన్ చేస్తే ఈజీగా అమ్మి డబ్బు ఇస్తానని నమ్మబలికాడు ప్రశాంత్. అలాగే చేశాడు ప్రసాద్.. కానీ ఎంతకీ ఇల్లు అమ్మకపోవడంతో ప్రశాంత్ పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ప్రసాద్ ని హతమార్చడానికి స్కెచ్ వేశాడు ప్రశాంత్.

ప్రసాద్ తో పాటు అతని కుటుంబ సభ్యులను చంపితే అప్పు తీరిపోతుంది.. ఆస్తి దక్కుతుందని దారుణమైన ఆలోచనతో మర్డర్ ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే ప్రసాద్ సహా అతని కుటుంబ సభ్యులను పథకం ప్రకారం చంపేశాడు. దారుణం ఏంటంటే.. ఈ ఘోరకలి గురించి తెలిసి నర హంతకుడికి సహాయం అందించింది అతని తల్లి వడ్డమ్మ(60). తన స్నేహితుడితో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తే ఆస్తి మొత్తం సొంతమవుతుందని అంటే ఓకే చెప్పింది. తాను చేసే హత్యలు ప్రసాద్ కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా తన తల్లి వడ్డమ్మను తీసుకొని నిజామాబాద్ లాడ్జ్ కు తీసుకువచ్చి ప్రసాద్ కుటుంబానికి కాపలాగా పెట్టాడు. అలా లాడ్జ్ నుంచి ఒక్కొక్కరినీ తీసుకు వెళ్లి దారుణంగా హతమార్చాడు. సుశీలను కూడా చంపేందుకు ప్రశాంత్ పాల్వంచ వైపు వెళ్తుండగా.. గాంధారి ఎక్స్ రోడ్డ వద్ద పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎంటైర్ మర్డర్ ఎపిసోడ్ లో ప్రసాద్ తల్లి సుశీల మాత్రం తప్పించుకోగలిగింది. తన కుటుంబాన్ని కోల్లోయి కన్నీరు మున్నీరైంది. ఆరు హత్యలు చేసిన ప్రశాంత్, అతనికి సహకరించిన తల్లి, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారణ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి